Late train welcome: లేటుగా వచ్చిన రైలు.. విసిగిపోయిన ప్రయాణికులు ఏం చేశారంటే.. వైరల్ వీడియో
రైలు ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు ఎక్కడ మిస్ అవుతామో అని కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకుని ఎదురుచూస్తుంటారు. అయితే ఒక్కోసారి రైలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. అది ఏ గంటో..
రైలు ప్రయాణికులు తాము ప్రయాణించే రైలు ఎక్కడ మిస్ అవుతామో అని కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకుని ఎదురుచూస్తుంటారు. అయితే ఒక్కోసారి రైలు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. అది ఏ గంటో… అరగంటలో అయితే పర్వాలేదు.. కానీ ఏకంగా 9 గంటలు రైలు కోసం ఎదురు చూడాలంటే ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? విసిగిపోతారు… తిట్టుకుంటారు కూడా. కానీ ఇక్కడ ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు కోసం ఏకంగా 9 గంటలు రైల్వేస్టేషన్‌లో కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూశారు. ఎట్టకేలకు రైలు రానే వచ్చింది. దానిని చూసి వారి ఆనందానికి హద్దులు లేవు. చప్పట్లు కొడుతూ ఆలస్యంగా వచ్చిన రైలుకు స్వాగతం పలికారు. ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. చివరకు రైలెక్కారు. ఇక తమ గమ్యం చేరడం గురించి ఆలోచిస్తున్నారు.ఇంతలో వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. మార్గమధ్యంలోని ఓ స్టేషన్‌లో రైలు ఆగిపోయింది. రైలు ఇంజిన్‌లో లోపం తలెత్తి రైలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో నాలుగు గంటలపాటు వేచి ఉన్న ప్రయాణికులు ఇంజిన్ పనిచేయకపోవడంతో చేసేది లేక కాలికి బుద్ధి చెప్పారు. మిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైలులో ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు చప్పట్లు కొట్టి మరీ స్వాగతించిన ఈ రైలు, మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్‌లోని బల్లార్షాలో ఈ రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైలును గోండియా స్టేషన్‌లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు

