AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో ఇక నూతన పార్లమెంట్ భవనం ?

ఢిల్లీలో ఇక కొత్త పార్లమెంట్ భవనం ఏర్పడవచ్ఛు. 2026 తరువాత ఉభయ సభల్లో మొత్తం సీట్ల సంఖ్య పెరిగే సూచనలున్నందున కొత్త భవనం ఏర్పాటు తప్పనిసరి అని కేంద్ర  ప్రజా పనుల శాఖ..సుప్రీంకోర్టుకు తెలిపింది. 1972 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ తరువాత..

ఢిల్లీలో ఇక నూతన పార్లమెంట్ భవనం ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 5:04 PM

Share

ఢిల్లీలో ఇక కొత్త పార్లమెంట్ భవనం ఏర్పడవచ్ఛు. 2026 తరువాత ఉభయ సభల్లో మొత్తం సీట్ల సంఖ్య పెరిగే సూచనలున్నందున కొత్త భవనం ఏర్పాటు తప్పనిసరి అని కేంద్ర  ప్రజా పనుల శాఖ..సుప్రీంకోర్టుకు తెలిపింది. 1972 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ తరువాత లోక్ సభలో 545 సీట్ల సంఖ్య అలాగే ఉందని, 2026 అనంతరం ఇది మరింత పెరుగుతుందని ఈ శాఖ పేర్కొంది. ప్రస్తుత లోక్ సభ, రాజ్యసభలో సీట్లు కిక్కిరిసి పోయి ఉన్నట్టు ప్రజాపనుల శాఖ కోర్టుకు సమర్పించిన తన 117 పేజీల అఫిడవిట్ లో వెల్లడించింది. నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించదలచిన, పునర్వ్యవస్థీకరించదలచిన సెంట్రల్ విస్తా రెనోవేషన్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆవశ్యకతను సవాలు చేస్తూ.. శిఖిల్ సూరి అనే లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు ఈ శాఖ అఫిడవిట్ సమర్పించింది.

లోక్ సభలో సీట్ల కెపాసిటీ 876 సీట్లకు పెరుగుతుందని, అలాగే ఉభయ సభల్లో 1224 సీట్లు ఉంటాయని పేర్కొంది.  రాజ్యసభ ఛాంబర్స్ లో 400 సీట్లు ఉండే అవకాశం ఉన్నట్టు ఈ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. 1921-1927 మధ్య నిర్మించిన ఈ పాత పార్లమెంట్ భవనాన్ని అప్పట్లో ‘ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’ అని వ్యవహరించేవారట.