ఆడపిల్ల పుడితే బిడ్డను ఏనుగుపై ఇంటికి తీసుకొచ్చిన తండ్రి..ఊరంతా షాక్

|

May 28, 2023 | 4:37 PM

ఆడపిల్లలు పుడితే భారంగా భావించి బాధపడే తల్లిదండ్రులు నాటి కాలం నుంచి నేటి వరకు ఉన్నారు. మరికొందరైతే ఆడపిల్లలను పెంచడం మా వల్ల కాదంటూ పురిటిలోనే చంపిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అయితే ఇటీవల కొన్ని కుటుంబాలు ఆడపిల్లలు పుడితే వేడుకలు కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటిదే తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ఆడపిల్ల పుడితే బిడ్డను ఏనుగుపై ఇంటికి తీసుకొచ్చిన తండ్రి..ఊరంతా షాక్
Elephant
Follow us on

ఆడపిల్లలు పుడితే భారంగా భావించి బాధపడే తల్లిదండ్రులు నాటి కాలం నుంచి నేటి వరకు ఉన్నారు. మరికొందరైతే ఆడపిల్లలను పెంచడం మా వల్ల కాదంటూ పురిటిలోనే చంపిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అయితే ఇటీవల కొన్ని కుటుంబాలు ఆడపిల్లలు పుడితే వేడుకలు కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటిదే తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తమ వంశంలో చాలా ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం అట్టహాసంగా సంబరాలు చేసుకుంది. అంతేకాదు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏకంగా ఏనుగుపైనే ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే కొల్హాపూర్ జిల్లా పచ్‌గవ్‌లో గిరీష్‌పాటిల్, సుధ దంపతులు నివసిస్తున్నారు. అయితే ఈ వీళ్లకు ఐదు నెలల క్రితం కుమార్తె పుట్టింది.

ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తన భార్యను గిరీష్ తొలిసారిగా ఇంటికి తీసుకొచ్చాడు. గిరీష్ వంశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. దీంతో ఈ ఆనందాన్ని గుర్తుండిపోయేలా చేయాలని.. అతను ప్లాన్ వేశాడు. గుజరాత్‌లో హత్తివరోన్‌లో ఉన్న తన భార్య, చిన్నారిని పచ్‌గావ్‌కు తీసుకొచ్చాడు. ఊరిపొలిమేర నుంచి డప్పుల వాయిద్యాలు ఏర్పాటు చేశాడు. పట్టణ శివారు నుంచి తన కూతురుని ఏనుగుపై ఇంటివరకు ఊరేగించాడు. అయితే గిరీష్ పూణెలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన కూతురి ఇంటికి తీసుకొచ్చే వేడుకలకు బంధువులు,ఇరుగుపొరుగు వారిని ఆహ్వనించి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండగా గతంలో కూడా మహారాష్ట్రలోని పూణె, రాజస్థాన్‌కు చెందిన కుటుంబాలు సైతం ఆడపిల్లలు పుడితే ఆ చిన్నారుల్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి