Jharkhand: ప్రేమను నిరూపిస్తానని సవాల్ విసిరి.. బాలికకు మాయమాటలు చెప్పి.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
ఓ బాలికతో కొందరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ఎట్రాక్షన్ కు దారి తీసింది. అయితే.. ఈ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. బాలిక తననే ప్రేమిస్తోందంటూ ఇద్దరు ఘర్షణకు దిగారు...

ఓ బాలికతో కొందరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ఎట్రాక్షన్ కు దారి తీసింది. అయితే.. ఈ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. బాలిక తననే ప్రేమిస్తోందంటూ ఇద్దరు ఘర్షణకు దిగారు. తమ ప్రేమను నిరూపిస్తానని ఓ యువకుడు సవాల్ విసిరాడు. అంతటితో ఆగకుండా చేసిన సవాల్ ప్రకారం బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు యువకుడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. జార్ఖండ్ లోని కోయలంచల్ ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఓ మైనర్ విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. బాలిక తనను ప్రేమిస్తోందని ఒక యువకుడు చెప్పాడు. అయితే ఆ బాలిక తననే ప్రేమిస్తోందని మరో యువకుడు చెప్పడంతో గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ అమ్మాయి తనను మాత్రమే ప్రేమిస్తోందని.. ఎవరూ అడ్డు రావొద్దని చెప్పాడు. కాదని వస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చుకున్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని సంజయ్ తన స్నేహితులకు సవాల్ విసిరాడు. ఆధారాలు కూడా చూపిస్తానని వారితో చెప్పాడు.
స్నేహితులకు ఛాలెంజ్ చేసిన తర్వాతి రోజే మైనర్‌కు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకాన్ని ఫోన్లో రికార్డు చేశాడు. బాలికతో ప్రేమలో ఉన్నాననేందుకు ఇదే రుజువు అని వీడియోను స్నేహితులకు పంపించాడు. అతని స్నేహితులు మాత్రం ఈ వీడియోను బాలిక బంధువులకు చూపించారు. వారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ తీరుపై మండిపడుతూ పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్‌ను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు పంపించారు.




మరిన్ని జాతీయ వార్తలు చదవండి..