Uttar Pradesh: బ్రాండెండ్ మద్యం తీసుకురాలేదని దారుణం.. స్నేహితుడిపై ఇనుమ రాడ్ తో దాడి..
ఆధునిక యుగంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కోపం పెంచుకుని దాడులు, హత్యలు చేస్తున్నారు. తాజాగా బ్రాండెడ్ మద్యం తీసుకురాలేదనే కారణంతో ఓ దివ్యాంగ యువకుడిని...

ఆధునిక యుగంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కోపం పెంచుకుని దాడులు, హత్యలు చేస్తున్నారు. తాజాగా బ్రాండెడ్ మద్యం తీసుకురాలేదనే కారణంతో ఓ దివ్యాంగ యువకుడిని నలుగురు యువకులు దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పొదల్లో పడేశారు. నవంబర్ 21న పక్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరణ్‌పూర్ గ్రామానికి చెందిన సునీల్ దివ్యాంగుడు. ఓ రోజు సునీల్ ఇంట్లో ఉన్న సమయంలో అతని స్నేహితులు మద్య తాగేందుకు ఆహ్వానించారు. తాము రోజంతా కష్టపడి వచ్చామని, అలసటగా ఉందంటూ బలవంతం చేశారు. సునీల్ తో కలిసి డ్రింక్ చేసేందుకు బయటకు వెళ్లారు. ఈ సమయంలో సునీల్ మద్యం దుకాణానికి వెళ్లి రెండు బాటిళ్ల వైన్ కొన్నాడు. వాటిని తీసుకువెళ్లి స్నేహితులకు ఇచ్చాడు. వారి మధ్య బ్రాండెడ్, లోకల్ క్వాలిటీ లిక్కర్ అనే విషయంలో ఏర్పడిన గొడవ తీవ్ర రూపం దాల్చింది.
డబ్బులు మిగుల్చుకునేందుకు లోకల్ చీప్ లిక్కర్ తెచ్చావంటూ సునీల్ పై అతని ఫ్రెండ్స్ దాడి చేశారు. సర్ది చెప్పిన తర్వాత అందరూ కలిసి మద్యం తాగారు. అయినా మహేశ్ అనే యువకుడు సునీల్ పై కక్ష పెంచుకున్నాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ దారుణమైన పథకం పన్నాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో సునీల్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. తర్వాత చనిపోయాడని నిర్ధారించుకుని మృతదేహాన్ని పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయారు. అదే సమయంలో సునీల్ రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టాడు.
ఉదయం పొదల్లో సునీల్ కనిపించాడు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే సునీల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు ఎస్పీ దీపేంద్ర చౌదరి తెలిపారు. కీలకంగా వ్యవహరించిన మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..



