Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber crime: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బురిడి కొట్టించిన కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో ఏకంగా..

ఇలాంటి నేరాల బారిన పడుతున్న వారు ఏ చదువులేని వారో, మారుమూల గ్రామస్థులు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. మంచి చదువు, ఉద్యోగం, పట్టణాల్లో జీవిస్తున్న వారు కూడా మోసపోవడం గమనార్హం. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇలాంటి సైబర్‌ మోసగాళ్ల మాటలకు మోసపోయి భారీ మొత్తంలో పోగొట్టుకుంది. సైబర్‌ నేరస్థులు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో చెప్పేందుకు...

Cyber crime: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బురిడి కొట్టించిన కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌ కాల్‌తో ఏకంగా..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2023 | 9:14 AM

టెక్నాలజీ మారుతోంది. ఇంట్లో కూర్చునే ఉద్యోగం చేస్తున్నాం, ఇంట్లో కూర్చునే షాపింగ్ చేసే రోజులు వచ్చేశాయ్‌. అయితే మారుతోన్న కాలానికి, టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు సైతం మారుతున్నాయి. నేరస్థులు కూడా ఇంట్లో కూర్చునే నేరాలు చేసే రోజులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడో మూలన కూర్చొని, మన ఖాతాల్లోని డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రోజురోజుకీ ఇలాంటి నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

అయితే ఇలాంటి నేరాల బారిన పడుతున్న వారు ఏ చదువులేని వారో, మారుమూల గ్రామస్థులు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. మంచి చదువు, ఉద్యోగం, పట్టణాల్లో జీవిస్తున్న వారు కూడా మోసపోవడం గమనార్హం. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇలాంటి సైబర్‌ మోసగాళ్ల మాటలకు మోసపోయి భారీ మొత్తంలో పోగొట్టుకుంది. సైబర్‌ నేరస్థులు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు..

బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుంది.. ఇదే సమయంలో ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. ముంబయి సైబర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నారు. అనంతరం.. మీరు తైవాన్‌ నుంచి కొరియర్‌లో ఎండీఎంఏ మాదకద్రవ్యాలు తెప్పించుకున్నట్లు తేలింది. ఆ కొరియర్‌ మీరే బుక్‌ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. బెంగళూరు సైబర్‌ పోలీసులకు మీపై ఫిర్యాదు చేస్తున్నాం. వారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు జాగ్రత్త అని తెలిపారు.

దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆమె, నేను ఎలాంటి మాదకద్రవ్యాలను బుక్ చేయాలలేదని చెప్పినా, అవతలి వ్యక్తి బెదిరించడం మాత్రం ఆపలేదు. అంతలోనే ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కాలని.. ఇందులో నుంచి బయటపడే మార్గం చెప్పరా, అంటూ ఫోన్‌ చేసిన వ్యక్తినే కోరింది. దీంతో ఇదే అదునుగా భావించిన సైబర్‌ నేరస్థుడు.. దీంతో మీకు ఎలాంటి సంబంధం లేదని తేల్చుతాం అందు కోసం రిజర్వ్‌ బ్యాంక్‌లో రూ. 3.46 లక్షలు డిపాజిట్ చేయండి, తర్వాత మొత్తం తిరిగి మళ్లీ మీకే వస్తుందని నమ్మించాడు.

దీంతో వెనకా ముందు ఆలోచించని సదరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అగంతకుడు చెప్పిన ఖాతాలోకి డబ్బును పంపించింది. తీర కాసేపయ్యే ఫోన్‌ చేస్తే.. అవతలి వ్యక్తి ఫోన్‌ స్విచ్ఛాఫ్ వచ్చింది. రోజులు గడిచినా చెల్లించిన డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మోసపోయానని అర్థమై బెంగళూరు సైబర్‌ పోలీసులను ఆశ్రయించగా, మీరు మోసపోయారు అని తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..