కశ్మీర్‌లో భారీ ఆపరేషన్స్.. 64 మంది ఉగ్రవాదులు హతం..!
గతేడాదిలాగే ఈ ఏడాది కూడా జమ్ముకశ్మీర్‌లో భారీగానే టెర్రర్ ఆపరేషన్స్ జరిగాయి. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 27 ఆపరేషన్ప్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. “జనవరి నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్స్ చేశాం. ఈ ఘటనలో 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా మరో 25 మంది ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశాం. ఈ క్రమంలో […]

గతేడాదిలాగే ఈ ఏడాది కూడా జమ్ముకశ్మీర్‌లో భారీగానే టెర్రర్ ఆపరేషన్స్ జరిగాయి. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 27 ఆపరేషన్ప్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. “జనవరి నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్స్ చేశాం. ఈ ఘటనలో 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా మరో 25 మంది ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశాం. ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను బుధవారం మట్టుబెట్టాం. ఈ ఉగ్రవాది కోసం గత ఆరు నెలలుగా తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాం.”అని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.
కాగా.. గత మార్చి నెలలో కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం పాక్ ప్రేరేపతి ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కుట్రలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. కేవలం లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది.