ఆగ్రా జైల్లో.. ఖైదీకి.. కరోనా పాజిటివ్..!
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ యూపీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
కాగా.. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా సెంట్రల్ జైలులో ఓ ఖైదీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలన్నర నుంచి సందర్శకులు, బయటి వక్తులు రానప్పటికీ ఓ ఖైదీకి కోవిద్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు రీ చెక్ కోసం శాంపిల్ పంపారు. మరో 14 మంది ఖైదీలను క్వారంటైన్ కు తరలించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,998 కరోనా కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతి చెందారు. 1130 మంది కోలుకున్నారు.