అయ్యో.. ఇంట్లో ఆడుకుంటూ టూత్‌పేస్ట్ తిన్న పిల్లోడు.. కాసేపటికే వాంతులు.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
Tobacco toothpaste Death: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంట్లో ఆడుకుంటూ పొగాకు టూత్‌పేస్ట్ తిని అస్వస్థతకు గురయ్యాడు ఆరు నెలల బాలుడు. గమనించిన కుటుంబ సభ్యలు చిన్నారిని హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్దారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పొగాకు టూత్‌పేస్ట్ తిని ఆరు నెలల బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లోని ఇగ్లాస్ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం, అలీఘర్‌లోని ఇగ్లాస్ ప్రాంతంలోని కరాస్ గ్రామంలో, ఆరు నెలల బాలుడు హసన్ ఇంట్లో ఆడుకుంటూ పొగాకుతో కూడిన టూత్‌పేస్ట్‌ను నోట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని మింగేశాడు. అయితే కొద్దిసేపటికే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో, ఆ చిన్నారి తండ్రి రాజు పనికి వెళ్ళాడు. అతని భార్య, బిడ్డ హసన్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే తల్లి వంటగదిలో ఉండగా.. పిల్లవాడు ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్నట్టు తండ్రి రాజు తెలిపాడు. ఈ క్రమంలో బాలుడు పొగాకు టూత్‌పేస్ట్ తిన్నాడని, దీంతో బాబును అస్వస్థతకు గురైనట్టు తనకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. తాను వెంటనే ఇంటికి చేరుకొని బాలన్ని హాస్పిటల్‌కు తీసెకెళ్లానని.. కానీ అప్పటికే హసన్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించినట్టు తెలిపాడు.
పొగాకు టూత్‌పేస్ట్ పిల్లలకు పూర్తిగా విషం
ఈ ఘటనపై జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ పొగాకు టూత్‌పేస్ట్ వాడకం ప్రాణాంతకం కావచ్చు. ఇది ఊపిరితిత్తులు, గుండె, నోరు, పేగులు, మెదడుకు హానికరం. ప్రజలు దీనిని పంటి నొప్పి నివారణగా ఉపయోగిస్తారు, కానీ ఇది చాలా ప్రమాదం అని అన్నారు. ఇది పిల్లలకు పూర్తిగా విషంతో సమానమని ఆయన తెలిపారు. దీన్ని ఇంట్లో కూడా ఉంచకూడదని. మీకేవైనా పంటి సమస్యలు ఉంటే దంత వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




