AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana: ఐదుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసిన పెద్ద మనిషి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అంబాలా నగరంలోని

Haryana: ఐదుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసిన పెద్ద మనిషి..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Suicide
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2022 | 4:43 PM

Share

Ambala suicide: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్య‌క్తులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం అంబాలాలోని బ‌లానా గ్రామంలో జ‌రిగింది. మృతిచెందిన వారిలో సంగ‌త్ రామ్‌, భార్య మ‌హింద‌ర్ కౌర్‌, కుమారుడు సుఖ్వింద‌ర్ సింగ్‌, సుఖ్వింద‌ర్ భార్య రినా, వాళ్ల పిల్ల‌లు అషు, జాసిలు కూడా ఉన్నారు. సుఖ్వింద‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల‌కు విషం ఇచ్చి ఆ త‌ర్వాత అత‌ను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సుఖ్వింద‌ర్ ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. పోస్టుమార్ట‌మ్ కోసం మృత‌దేహాల‌ను అంబాలా సిటీ సివిల్ ఆస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఇంట్లోకి చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అంబాలా నగరంలోని ట్రామా సెంటర్ మార్చురీలో ఉంచారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు ప్రస్తావన ఉందని పోలీసులు చెప్పారు. అదే సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow Us
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
మీకు సొంతిల్లు లేదా..? కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు
మీకు సొంతిల్లు లేదా..? కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు
అమరావతి, అభివృద్ధి, ఆర్థిక వనరులు.. పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లు
అమరావతి, అభివృద్ధి, ఆర్థిక వనరులు.. పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?