ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అతి వేగంగా వెళ్లి రోడ్డుపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ కిందకు దూసుకెళ్లింది. దాంతో కారుకు నిప్పంటుకోగా..

Road Mishap: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అతి వేగంగా వెళ్లి రోడ్డుపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ కిందకు దూసుకెళ్లింది. దాంతో కారుకు నిప్పంటుకోగా.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై 160 కిలోమీటర్ల మైలురాయి వద్ద చోటు చేసుకుంది. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వారు.. లక్నో నుంచి నోయిడాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే కారులోని ప్రయాణికులు మంటల్లో పూర్తిగా కాలిపోయారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Corona Tests : తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..కోవిడ్ పరీక్షల ధరలను సవరించిన ప్రభుత్వం
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ర్యాలీ యువకుల హంగామా.. తల్వార్లతో హల్‌చల్ చేసిన కార్యకర్తలు