ఆపరేషన్ షవర్మ.. పలువురిపై రూ. 36 లక్షలు జరిమానా.. 317దుకాణాలు క్లోజ్..!
2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8224 సంస్థలను తనిఖీ చేశారు. 2023 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 6689 సంస్థలను తనిఖీ చేశామని మంత్రి పేర్కొన్నారు.
కేరళ ఫుడ్ పాయిజన్ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరువనంతపురంలో జరిగినతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. వివిధ సంస్థలకు కలిపి రూ.36 లక్షల జరిమానా విధించారు అధికారులు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో.. ఆపరేషన్ షవర్మలో భాగంగా రూ.36,42,500 జరిమానా వసూలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8224 సంస్థలను తనిఖీ చేశారు. 2023 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 6689 సంస్థలను తనిఖీ చేశామని మంత్రి సభలో పేర్కొన్నారు.
తనిఖీల్లో దోషులుగా తేలిన 317 సంస్థలను మూసివేశామని, 834 సంస్థలకు నోటీసులు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. షవర్మా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందన్న నివేదికలు పెరగడంతో రాష్ట్రంలో షవర్మా తయారీకి ఏకరీతి ప్రమాణాలు తీసుకొస్తామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గతంలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ చట్టం కింద అత్యవసరంగా ఈ ఉత్తర్వు జారీ చేశారు.
పచ్చి గుడ్లతో తయారుచేసిన మయోనైజ్ సకాలంలో ఉపయోగించకపోతే చాలా ప్రమాదకరమని అధికారుల తనిఖీల్లో తేలింది. హోటల్, రెస్టారెంట్, బేకరీ, వీధి వ్యాపారులు, క్యాటరింగ్ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్‌పై నిషేధానికి పూర్తి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌ను తక్షణమే నిషేధిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..