Winter Carnival: వావ్.. స్వర్గమంటే ఇదేకదా..! పొగమంచు చీరలో అందమైన కాశ్మీరాన్ని చూడాల్సిందే..
కనుచూపు మేరలో భూమి తెల్లటి పొరతో కమ్మేసింది. పైనుండి మాంత్రికుడి దండంలా మంచు కురుస్తోంది. ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి అందాలను చూసి మనసు పారేసుకోని వారు ఉండరు. పొగమంచుతో కమ్ముకున్న కాశ్మీర్ ఫోటోలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి.

శీతాకాల విరామం తర్వాత ఏప్రిల్ 26న కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని, ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుస్తామని ఆలయ కమిటీ జనవరి 27న తెలిపింది. శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27 న తెరవనున్నారు.
- చలికాలం మొదలైంది. మృదువుగా కురుస్తున్న పొగమంచు చలిలో కూడా మనసుకు ఊరటనిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్లో పొగమంచు వాతావరణం కన్నుల పండువగా ఉంటుంది. కాశ్మీర్‌లోని కుప్వారా తాజా మంచుతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది.. నెటిజన్లు ‘వింటర్ కార్నివాల్’ అని పిలుస్తున్నారు.
- చలికాలంలో కాశ్మీర్‌ను మించిన ప్రాంతమేదీ అందంగా ఉండదు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గుల్మార్గ్, శ్రీనగర్, పహల్గాం, కుప్వారా వంటి ప్రాంతాల్లో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతాకాలం అక్టోబర్ నుండి మార్చి ప్రారంభం వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచుతో కూడిన కాశ్మీర్ శిఖరాన్ని చూడవచ్చు.
- కాశ్మీర్లో మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమపాతం అద్భుతమైన దృశ్యం. వేలాది మంది పర్యాటకులను ఆకర్షించింది. నివాసితులు,సందర్శకులు జమ్మూ, కాశ్మీర్ అద్భుతమైన ఫోటోలను పంచుకుంటారు. ప్రస్తుతం కశ్మీర్‌లోని నగరం, దేవాలయాలు, రోడ్లు పొగమంచుతో కప్పబడిన ఫోటో అన్ని చోట్లా వైరల్ అవుతోంది.
- హిమపాతం తర్వాత కేదార్నాథ్ ఆలయం పొగమంచుతో కప్పబడి ఉంది. కేదార్‌నాథ్‌లో చాలా రాత్రులుగా మంచు కురుస్తోంది. ఆ ప్రాంతంలో 4 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ధామ్ ప్రాంగణం, చుట్టుపక్కల ఉన్న కొండలపై భారీ హిమపాతం కనిపిస్తుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ పోలీసులు పౌరులకు హెచ్చరిక జారీ చేశారు. రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
- కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ప్రారంభ తేదీ ఫిక్స్ అయిన వెంటనే చార్ ధామ్ యాత్రకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ గల ‘చార్ ధామ్’ అని పిలువబడే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.
- శీతాకాల విరామం తర్వాత ఏప్రిల్ 26న కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయని, ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుస్తామని ఆలయ కమిటీ జనవరి 27న తెలిపింది. శ్రీ బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27 న తెరవనున్నారు.
- రైల్వే మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్లో మంచుతో కప్పబడిన ట్రాక్‌ల గుండా రైలు నడుస్తున్న వీడియోను షేర్ చేసింది. చుట్టూ మంచుతో కూడిన తెల్లటి దుప్పటితో కప్పబడి ఉన్నటుగ్గా వీడియో కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని ఓ లోయ గుండా రైలు వెళుతున్నట్లు కనిపిస్తుంది.







