F-35B: ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎపిసోడ్లో కీలక మలుపు.. బ్రిటన్ నుంచి కేరళకు..
గత మూడు వారాలుగా తిరువనంతపురం ఎయిర్ పోర్టులోనే ఉన్న ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ఎపిసోడ్లో కీలక మలుపు చోటుచేసుకుంది. గత నెల ఇండో యూకే నేవి విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఫైటర్ జెట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. అయితే మరమ్మత్తులు చేసినా స్టార్ట్ కాకపోవడంతో అప్పటినుంచి అక్కడే ఉంది.

కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఉన్న ఎఫ్-35బీ ఫైటర్ జెట్ తరలింపుకు రంగం సిద్ధమైంది. ఈ యుద్ధ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో గత 3 వారాలుగా అదే ఎయిర్ పోర్టులో ఉంది. ప్రస్తుతం దాన్ని హ్యాంగర్‌కు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత నెల ఇండియా – యూకే నేవి విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జూన్ 14న ఈ ఫైటర్ జెట్2ను తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత వాతావరణ మార్పులు, ఇంధన కొరత అంటూ ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్2తోనే విమానం ఆగిపోయిందని యూకే అధికారులు తెలిపారు. అదే రోజు రాత్రి యూకే నిపుణులు ఎఫ్-35బీ కి మరమ్మత్తుల చేశారు. అయినా ఈ విమానం స్టార్ట్ అవ్వలేదు. దీంతో అప్పటి నుంచి ఇది ఎయిర్ పోర్టులోనే ఉంది.
తాజాగా బ్రిటన్‌కు చెందిన 24మంది ఏవియేషన్ టీమ్ తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఎఫ్-35బీ విమానాన్ని సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే భాగాలుగా విడదీసి సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో యూకేకి తరలించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులోని హ్యంగర్2కు ఫైటర్ జెట్‌ను తరలించారు. కాగా 2019లోనూ ఎఫ్-35 విమానంలో ఇలాంటి సమస్యలే తలెత్తితే దాన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. మొట్టిమొదటి ఎఫ్-35 ఎయిర్ లిఫ్ట్ ఇదే కావడం గమనార్హం. అప్పుడు సీ-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా ఎఫ్-35 విమానాన్ని తరలించారు. ఇప్పుడు కూడా అదే చేయనున్నారు.
#WATCH | Thiruvananthapuram, Kerala: A team of technical experts on board the British Royal Air Force Airbus A400M Atlas, arrive at the Thiruvananthapuram International Airport to assess the F-35 fighter jet.
The F-35 jet had made an emergency landing at the Thiruvananthapuram… pic.twitter.com/KEbM1BSRdE
— ANI (@ANI) July 6, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.