- Telugu News India News 18 dead, dozens missing in Kerala IMD says rain to subside Lord Ayappa devotees told to not visit Kerala’s Sabarimala temple amid rainfall, floods
Kerala rainfall, floods: కేరళలో వర్ష బీభత్సం, 18 మంది మృతి.. 22మంది గల్లంతు. శబరిమల దర్శనం రద్దు
Updated on: Oct 17, 2021 | 9:48 AM

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటినుంచి ఏకధాటి వర్షాలకు కేరళ వణికిపోతోంది. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వర్షాల ధాటికి ఆరుగురు మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కొట్టాయంలో విరిగిపడ్డ కొండ చరియల దృశ్యాలు

పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కొట్టాయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళలో 6 జిల్లాల్లో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు.

ఇవాళ, రేపు శబరిమలలో దర్శనం రద్దు.. భక్తులు రావొద్దన్న ట్రావెన్‌కోర్ బోర్డు

ఇడుక్కిలో వరద విలయం సృష్టిస్తోంది. వరద ఉధృతికి 15మంది గల్లంతయ్యారు. ప్రాజెక్టుల పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వర్షాలు, వరదల విధ్వంసంలో రెండ్రోజుల పాటు శబరిమల దర్శనాన్ని దర్శనం చేశారు.

మరోవైపు రాష్ట్రంలోని వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 11 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించింది NDRF.





























