కల్తీ మద్యం తాగి 13 మంది మృతి.. 30 మందికి అస్వస్థత.. నలుగురు పోలీసులపై వేటు..

|

May 15, 2023 | 1:26 PM

మరోవైపు, ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

కల్తీ మద్యం తాగి 13 మంది మృతి.. 30 మందికి అస్వస్థత.. నలుగురు పోలీసులపై వేటు..
Liquor Shop
Follow us on

ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు . విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఇన్‌ స్పెక్టర్లు, నలుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ తెలిపారు. కల్తీ మద్యం, గుట్కా తయారు చేసి సరఫరా చేసిన 9 మందిని పోలీసులు 57 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

పుదుచ్చేరి నుంచి అక్రమంగా కల్తీసారా తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమరన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనితోపాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన వారు ఇండస్ట్రియల్ మిథనాల్ మిక్స్డ్ కల్తీ మద్యం సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..