బాలుడి వీరోచిత సాహసం.. తల్లీబిడ్డ క్షేమం!

సోనిట్‌పూర్‌: విస్తారంగా కురుస్తున్న కుండబోతు వర్షాలకు అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. దీంతో నదులు, చెరువుల నీటిమట్టం తారాస్థాయికి చేరింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం నదిలో చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను.. ఓ 11 ఏళ్ళ బాలుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. జూలై 7న ఓ మహిళ తన బిడ్డతో నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. నీటి ఉదృతి పెరగడంతో చిక్కుకుపోయింది. అయితే నదిలో మునిగిపోతున్న ఆ తల్లీబిడ్డలను చూసిన 11 ఏళ్ళ ఉత్తమ్‌ […]

బాలుడి వీరోచిత సాహసం.. తల్లీబిడ్డ క్షేమం!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 6:33 PM

సోనిట్‌పూర్‌: విస్తారంగా కురుస్తున్న కుండబోతు వర్షాలకు అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. దీంతో నదులు, చెరువుల నీటిమట్టం తారాస్థాయికి చేరింది. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం నదిలో చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను.. ఓ 11 ఏళ్ళ బాలుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. జూలై 7న ఓ మహిళ తన బిడ్డతో నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. నీటి ఉదృతి పెరగడంతో చిక్కుకుపోయింది. అయితే నదిలో మునిగిపోతున్న ఆ తల్లీబిడ్డలను చూసిన 11 ఏళ్ళ ఉత్తమ్‌ టాటి క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకి.. తల్లీబిడ్డలను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇక తన ప్రాణం కూడా లెక్కచేయకుండా చిన్న వయసులో ఇంతటి సాహసం చేసిన ఉత్తమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయమై జిల్లా మేజిస్ట్రేట్‌ లాఖ్య జ్యోతిదాస్‌ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తల్లీబిడ్డలను కాపాడిన ఉత్తమ్‌‌ పేరును జాతీయస్థాయి సాహస బాలుర అవార్డుకు సిఫారసు చేశామన్నారు.