FASTag: 26 నుంచి అక్క‌డ పూర్తిగా ఫాస్టాగ్ విధానం అమ‌లు.. మ‌హారాష్ట్ర రోడ్డు అభివృద్ధి శాఖ కీల‌క నిర్ణ‌యం

FASTag: టోల్ గేట్ల వ‌ద్ద ఫాస్టాగ్ విధానం అమ‌లుపై మ‌హారాష్ట్ర రోడ్డు అభివృద్ధి శాఖ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 26 నుంచి ముంబై న‌గ‌రంలోని...

FASTag: 26 నుంచి అక్క‌డ పూర్తిగా ఫాస్టాగ్ విధానం అమ‌లు.. మ‌హారాష్ట్ర రోడ్డు అభివృద్ధి శాఖ కీల‌క నిర్ణ‌యం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 26, 2021 | 4:57 AM

FASTag: టోల్ గేట్ల వ‌ద్ద ఫాస్టాగ్ విధానం అమ‌లుపై మ‌హారాష్ట్ర రోడ్డు అభివృద్ధి శాఖ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 26 నుంచి ముంబై న‌గ‌రంలోని బంద్రా-వ‌ర్లి సీ లింక్‌, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే వ‌ద్ద 100 శాతం ఫాస్టాగ్ విధానాన్ని అమ‌లు చేయ‌నుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫాస్టాక్ విధానం ద్వారా వాహ‌న‌దారులు టోల్ ప్లాజా వ‌ద్ద బారులు తీరాల్సిన అవ‌స‌రం లేకుండా సులువుగా వెళ్లిపోవ‌చ్చు. ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డిజిట‌ల్ పేమెంట్ రూపంలో టోల్ చేయ‌వ‌చ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఇంకా ఫాస్టాగ్ తీసుకోని వాహ‌న‌దారులు రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫాస్టాగ్ విధానంలో టోల్ ఫీజు చెల్లించేవారికి ఇటీవ‌ల ప్ర‌భుత్వం 5 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్ అమ‌లు చేసేందుకు కేంద్ర అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో ఫాస్టాగ్ అమ‌లు చేస్తుండ‌గా, కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ అమ‌లు కావ‌డం లేదు. ఇప్ప‌టికే పొడిగింపు విధించిన కేంద్రం.. అన్ని టోల్ గేట్ల వ‌ద్ద ఫాస్టాగ్‌ను ఉప‌యోగించుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది.

మీరు వాహనం కొని 8 ఏళ్లు గడిచాయా! అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. లేదంటే జేబుకు చిల్లు తప్పదు..