Ram Nath Kovind: కఠోర పరిస్థితుల్లోనూ సరిహద్దులను జవాన్లు కాపాడుతున్నారు: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలని ఆయన అన్నారు...
Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు.
కఠోర పరిస్థితుల్లోనూ సరిహద్దులను జవాన్లు కాపాడుతున్నారని అన్నారు. ప్రజలంతా రైతులకు రుణపడి ఉండాలని, రైతులు, సైనికులు దేశానికి వెన్నుముక అని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. గత ఏడాది ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నామని అన్నారు. అలాగే జాతీయ ఓటరు దినోత్సవం గురించి మాట్లాడుతూ.. ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలని, ప్రపంచంలో అనేక ప్రాంతాల వాళ్లు ఈ హక్కు కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రపంచంలో ప్రాచీణ ప్రజాస్వామిక దేశం అమెరికాలోనూ ఓటు హక్కు కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేశారని తెలిపారు.
Also Read:
Telangana Cop: ఇద్దరు ప్రాణాలను కాపాడిన సీఐకి రాష్ట్రపతి అవార్డు… ప్రకటించిన కేంద్ర హోం శాఖ…