Pan Aadhaar Link: పాన్ కార్డ్ హోల్డర్స్‌కు అలర్ట్.. రూ. 1000 ఆదా చేసే అవకాశం.. వెంటనే వివరాలను తెలుసుకోండి..

పాన్ కార్డ్ హోల్డర్స్‌కు గమనిక.. రూ. 1000 ఆదా చేసే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.. వెంటనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Pan Aadhaar Link: పాన్ కార్డ్ హోల్డర్స్‌కు అలర్ట్..  రూ. 1000 ఆదా చేసే అవకాశం.. వెంటనే వివరాలను తెలుసుకోండి..
Aadhaar Pan Card
Follow us

|

Updated on: Jan 09, 2022 | 7:03 AM

Pan Aadhaar Link: మీరు పాన్ కార్డ్ హోల్డర్ అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఫైన్ పడే అవకాశం నుంచి తప్పించుకున్నట్లే… ఫైన్ ఎంటనిగా మీరు ఆలోచిస్తున్నది. అవును మీరు 1000 రూపాయల వరకు ఆదా చేసుకునే శుభ వార్తే ఇది. వాస్తవానికి ప్రభుత్వం 31 డిసెంబర్ 2021 (ఆధార్ పాన్ లింక్ చివరి తేదీ) నాటికి పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేయడానికి గడువును నిర్ణయించింది. ఈ తేదీలోగా తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారికి 1000 రూపాయల జరిమానా విధింపు నిబంధన ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు 1000 రూపాయల జరిమానాతో పాటు అనేక ఇతర సమస్యలను నివారించాలనుకుంటే.. వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయండి. పాన్-ఆధార్ లింక్ చేయడానికి 31 మార్చి 2022 చివరి తేదీ అని మరోసారి ఐటీ అధికారులు ప్రకటించారు.

ఆధార్‌, పాన్‌ కార్డులను లింక్‌ చేయని వారిపై జరిమానా విధించేలా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. ఇందుకోసం గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక బిల్లును ఆమోదించింది. పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేసుకోని వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్స్ బిల్లులో రూల్ పెట్టారు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234హెచ్‌ని చేర్చారు.

ప్రభుత్వం నిబంధనను సవరించింది

ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ ప్రకారం నిర్ణీత గడువులోగా పాన్ కార్డును ఆధార్ కార్డులను లింక్ చేయడం తప్పనిసరి అని రూల్ చెబుతోంది. ఒక వ్యక్తి ఇలా చేయకుంటే జరిమానాగా అతని నుండి మొత్తం రికవర్ చేయబడుతుంది. అది గరిష్టంగా రూ. 1000 వరకు ఉంటుంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం. అనేక మీడియా నివేదికలలో దీని గురించి వివరణాత్మక సమాచారం ఇవ్వబడింది.

పాన్-ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు

పాన్-ఆధార్ లింక్ (ఆధార్ పాన్ లింక్ లాస్ట్ డేట్) చేయనట్లయితే కేవలం వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే కాదు. పాన్ కార్డ్ హోల్డర్ ఎదుర్కొనే అనేక రకాల ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఈ రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేయకపోతే.. PAN చెల్లదు.  దానికి సంబంధించిన అన్ని పనులు ఆగిపోతాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌ను షేర్లలో చేయడం కుదరదు. అలాగే కొత్త బ్యాంకు ఖాతా కూడా తెరవలేరు. అలాగే మీరు పాత KYCని చేయలేరు. ఇలాంటి చాలా సమస్యలు మీరు ఎదుర్కొంటారు. 

మీ పాన్ కార్డ్ చెల్లనిది అయితే మీరు దానిని ఉపయోగించలేరు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి చెల్లని పాన్ కార్డును ఉపయోగిస్తే.. అసెస్సింగ్ అధికారి అతనిపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. పాన్ కార్డ్ చెల్లుబాటు కాకపోతే, ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) కూడా ఫైల్ చేయలేరు. కాబట్టి, పాన్-ఆధార్ లింక్ చివరి తేదీకి ముందు పాన్ కార్డ్ హోల్డర్ రెండు పత్రాలను లింక్ చేయడం.. ఆర్థిక నష్టాలను నివారించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. ఇలా చేయడం ద్వారా పెనాల్టీ తప్పించబడుతుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎటువంటి పరిమితి లేకుండా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి: Video Viral: స్నేహం కోసం సింహం ఆరాటం.. నీతో నావల్ల కాదంటూ పారిపోయిన శునకం.. వీడియో వైరల్..

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో పోలింగ్.. ఎన్నికల షెడ్యూల్‌పై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏమన్నారంటే?