Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: LICలో పెట్టుబడికి FDIలకు లైన్‌ క్లియర్‌.. వాటాల విక్రయానికి కేంద్రం ఏర్పాట్లు.. అతిత్వరలో పబ్లిక్‌ ఇష్యూ!

LIC విక్రయానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ అవుతోంది. తన వాటాల అమ్మకానికి శరవేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర సర్కార్.

LIC IPO: LICలో పెట్టుబడికి FDIలకు లైన్‌ క్లియర్‌..  వాటాల విక్రయానికి కేంద్రం ఏర్పాట్లు.. అతిత్వరలో పబ్లిక్‌ ఇష్యూ!
Lic
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2022 | 2:06 PM

LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) విక్రయానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ అవుతోంది. తన వాటాల అమ్మకానికి శరవేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర సర్కార్. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో LICని పబ్లిక్‌ ఇష్యూకు (Public Issue) తీసుకురావాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఇందుకు సకలవిధాలా సన్నాహాలు చేస్తోంది. ఈ IPOను సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు- రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా మెసేజ్‌లు పంపిస్తూ, యాడ్స్‌ ఇస్తూ, ప్రోత్సాహకాలను మొదలుపెట్టింది. LICలో వాటాల విక్రయం ద్వారా 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు నిధులను సమీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూకు తేవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఏడాది క్రితమే ఇందుకు బీజం పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది కేంద్రం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థల నుంచి వైదొలగాలన్న ఆలోచనకు వచ్చింది. ఇందులో భాగంగానే ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి ముందడుగు వేసింది కేంద్రం. ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకొస్తున్న కేంద్రం, అందుకు వీలైన అన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందుకోసం FDIలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఐసీలో నేరుగా 20 శాతం FDIలు పెట్టేలా లైన్‌ క్లియర్‌ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.

దేశంలోనే ఎల్‌ఐసీ అతిపెద్ద సంస్థ. దీని మొత్తం ఆస్తులు, మార్కెట్‌ విలువ 38 లక్షల కోట్లు. దేశంలోని ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరుగా ఎల్‌ఐసీ ఖ్యాతికెక్కింది. ఆరోగ్య బీమా నుంచి రుణ మంజూరు వరకూ ప్రజానీకానికి అనేకానేక సేవలందిస్తోంది. ఇందులో లక్షా 14 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ఏజెంట్లు సైతం లక్షల్లో ఉన్నారు. వీరందరికీ జీవనోపాధి, పాలసీదారులకు ధీమాను అందిస్తోంది. జనం మెచ్చిన సంస్థగా నిలిచిన LIC ప్రస్తుతం పబ్లిక్‌ ఇష్యూకు వస్తుండడంపై మార్కెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Read Also….  Saree in Matchbox: చేనేత కార్మికుడి అద్బుత సృష్టి.. అగ్నిపెట్టెలో చీర.. అభినందించిన మంత్రలు