AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Tips: ఫ్యాన్ వేసుకుని యోగా చేస్తున్నారా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి!

Yoga Day 2026: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దీంతో యోగా, ప్రాణాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొందరు తమ ఇంటిలోని ఓ గదిలో ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుని యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఇలా ఫ్యాన్ కింద యోగా చేయడం వల్ల యోగా ద్వారా లభించాల్సిన పూర్తి ఫలితాలు అందవని ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ హెచ్చరిస్తున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రత్యేక కథనం..

Yoga Tips: ఫ్యాన్ వేసుకుని యోగా చేస్తున్నారా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి!
Yoga TipsImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Jun 20, 2026 | 7:00 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌నెస్ కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం వంటివి చేస్తున్నారు. అయితే యోగాను ప్రశాంతమైన ఆరుబయట వాతావరణంలో (బాల్కనీ లేదా మేడ పైన) చేసుకుంటే చాలా మంచిది. కానీ నగరాల్లో ఉండే స్థలాభావ పరిస్థితులు, లేదా దోమల భయం వల్ల చాలా మంది తమ ఇళ్ల లోపలే యోగా చేయాల్సి వస్తోంది.

అలా గదిలో యోగా చేసేటప్పుడు ఉక్కపోతగా అనిపించడమో లేదా చెమటలు పట్టడమో జరుగుతుందని చాలా మంది ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటారు. అయితే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుని యోగా చేయడానికి ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తప్పుబడుతున్నారు. ఇలా యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు.

ఫ్యాన్ కింద యోగా చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటి?

మనం యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు శరీరం లోపల వేడి పుడుతుంది. ఈ వేడి వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు విసర్జించబడతాయి. ఇది ఒక సహజమైన డీటాక్స్ ప్రక్రియ. మీరు ఫ్యాన్ వేసుకోవడం వల్ల వచ్చే గాలికి చర్మం చల్లబడుతుంది. దీనివల్ల శరీరానికి పట్టాల్సిన చెమట పట్టదు.. వ్యర్థాలు లోపల నుండి బయటకు పోయే ప్రక్రియ చాలా స్లో అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

మనం ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల రోజంతా ఏసీలు లేదా ఫ్యాన్ల కిందే కూర్చుంటాం. కనీసం యోగా చేసే ఆ అరగంట, గంట సేపైనా శరీరానికి చెమట పట్టకపోతే లోపలి వ్యర్థాలు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు.

మీరు గదిలో యోగా చేస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకోకుండా గది కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిది. దీనివల్ల గాలి లోపలికి, బయటికి ప్రవహిస్తూ ఉంటుంది.

ఫ్యాన్ లేకుండా యోగా చేసినప్పుడు చాలా చెమట పడుతుంది. ఈ చెమట వల్ల బాడీ డీటాక్స్ అయి, శరీరం లోపల పరిశుభ్రత పెరుగుతుంది. ఫలితంగా మీ ఒంటి దుర్వాసనలు తగ్గి, రోజంతా చాలా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా అనిపిస్తుంది.

శరీరం లోపలి వ్యర్థాలు బయటకు పోవాలంటే శరీరానికి చెమటలు పట్టాలి. కాబట్టి, ఇకపై యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఫ్యాన్లు వేసుకోకుండా చేసేందుకు ప్రయత్నించండి.

Also Read: ఈ ఒక్క అలవాటు చాలు.. విజయం వైపు మీ ప్రయాణం మొదలైనట్టే!

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?