Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefit: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వ్యాయామం అవసరం అని సంకేతమట

ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అనేది ఎంత శారీరక శ్రమ చేస్తున్నారనే విషయంపై ఆధార పడి ఉంటుంది అని పెద్దల నమ్మకం. అయితే నేడు మారిన జీవనశైలి కారణంగా.. శారీరక శ్రమ తక్కువ కనుక చాలా మందికి వ్యాయామం అవసరం. అయితే మన శరీరానికి వ్యాయామం అవసరమని మనకు ఎలా తెలుస్తుంది? మన శరీరం మనకు శారీరక శ్రమ అవసరమని చెప్పే కొన్ని సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు.. ఈ రోజు శరీరం సూచించే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..

Yoga Benefit: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వ్యాయామం అవసరం అని సంకేతమట
Yoga BenefitsImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Jul 10, 2024 | 2:48 PM

వ్యాయామం గురించి ప్రతి వ్యక్తికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. కొందరు వ్యాయామం చేస్తే శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదని భావిస్తారు.. మరికొందరు శరీరం మంచి ఆరోగ్యంతో ఉంటే వ్యాయామం అవసరం లేదని నమ్ముతారు. అయితే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండటం తప్పు. వ్యాయామం అనేది శరీరానికి అవసరం. కనుక ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అనేది ఎంత శారీరక శ్రమ చేస్తున్నారనే విషయంపై ఆధార పడి ఉంటుంది అని పెద్దల నమ్మకం. అయితే నేడు మారిన జీవనశైలి కారణంగా.. శారీరక శ్రమ తక్కువ కనుక చాలా మందికి వ్యాయామం అవసరం. అయితే మన శరీరానికి వ్యాయామం అవసరమని మనకు ఎలా తెలుస్తుంది? మన శరీరం మనకు శారీరక శ్రమ అవసరమని చెప్పే కొన్ని సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు.. ఈ రోజు శరీరం సూచించే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..

శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యమైనది. ఈ విషయం శరీరం చెబుతుంది.. అయితే మనం ఆ లక్షణాలను గుర్తించలేము. కనుక ఈ రోజు మనం లక్షణాలు కనిపించినప్పుడు శరీరానికి వ్యాయామం అవసరం అని ఎలా తెలుసుకుంటాము.. శరీరానికి వ్యాయామం అవసరమని అర్థం చేసుకోవాలనేది తెలుసుకుందాం.. చాలా సార్లు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. వివిధ రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటి నివారణ కోసం వ్యాయామాన్ని చేయండి.

వెన్ను, నడుము, కాళ్ళలో నిరంతర నొప్పి ఎవరికైనా తరచుగా వెన్ను, చేతులు, కాళ్ళలో నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. ఎప్పుడూ బలహీనతగా అనిపిస్తే, అలసటగా ఉంటే ఈ సంకేతాలు శరీరానికి చాలా వ్యాయామం అవసరమని సూచిస్తున్నాయి. ఎందుకంటే వ్యాయామం శరీరాన్ని బలపరుస్తుంది. ఎముకలు బలపడతాయి.

ఇవి కూడా చదవండి

అధిక కొలెస్ట్రాల్: శారీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే.. వ్యాయామం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే భవిష్యత్తులో అది శరీర ఆరోగ్యానికి పెద్ద సమస్యగా మారుతుంది.

మానసిక ఆరోగ్యం: ప్రస్తుతం ఎక్కువ మంది శరీరాక శ్రమకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఎక్కువ మంది మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. విద్యార్థులు లేదా ఉద్యోగులు అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరూ తమ పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో మానసిక ప్రశాంతత కోసం వ్యాయామం చాలా ముఖ్యం. యోగాలో అనేక రకాల ఆసనాలు వేయవచ్చు. యోగా మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

పెద్ద నగరాల్లో మాత్రమే కాదు మెల్లగా ఓ మోస్తరు పట్టణాల్లో కూడా ఇప్పుడు బయట భోజనం చేయడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది బయటి ఆహారం మాత్రమే తింటారు. అందుకే ప్రస్తుతం జంక్ ఫుడ్స్ వ్యాపారం తారాస్థాయికి చేరుకుంది. దేశంలోని పెద్ద నగరాల్లోని ప్రజలు జంక్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారని దీన్నిబట్టి తెలుస్తోంది. ఈ జంక్ ఫుడ్ క్రమంగా మన కడుపులోని జీర్ణక్రియ ప్రక్రియను పాడు చేస్తుంది. బయట తినడం వల్ల మన కడుపు తరచుగా ఉబ్బిపోతుంది. అటువంటి పరిస్థితిలో వ్యాయామం చేయవలసిన అవసరం ఉంది. ఎక్కువ సమయం నడవవచ్చు. అనేక రకాల యోగా ఆసనాలను కూడా చేయవచ్చు. యోగా చేయడం వలన జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. మీకు ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..
వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..
ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు.. అమల్లోకి కొత్త నిబంధనలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే..ఏమౌతుందో తెలుఆ
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే..ఏమౌతుందో తెలుఆ
70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు
70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారా..?
రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్తున్నారా..?
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు..
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు..
మీరు ఈ పని చేయకపోతే మీ ఈపీఎఫ్‌వో నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు!
మీరు ఈ పని చేయకపోతే మీ ఈపీఎఫ్‌వో నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు!
బెడ్‌ రూమ్ లో ఉండే ఈ వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయట..!
బెడ్‌ రూమ్ లో ఉండే ఈ వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయట..!