Yoga Benefits: రోజూ వృక్షాసన చేయడం వలన మానసిక శారీరక ప్రయోజనాలు మీ సొంతం
ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయడం చాలా ప్రయోజనకరం. యోగా చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి. అదే సమయంలో ఎవారైనా మానసికంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే వృక్షాసన చేయడం మంచింది. దీనిని సాధన చేయడం చాలా సులభం.

కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీనితో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ కూడా తప్పని సరి. దీంతో వ్యాయామం, యోగా చేయడం చాలా ముఖ్యం.అయితే నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రోజులో చాలా బిజిబిజీగా గడుపుతున్నారు. దీంతో తమకంటూ తగిన సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. అందుకనే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇంట్లో యోగా చేయడానికి కొంత సమయం కేటాయింవచ్చు. ఇది మీ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఇంట్లోనే కొన్ని యోగా ఆసనాలను సులభంగా చేయవచ్చు. ఇది శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను ఇస్తుంది. వీటిలో వృక్షాసనం ఒకటి. ఈ వృక్షాసనాన్ని ప్రతిరోజూ చేస్తే శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రోజు వృక్షాసనం గురించి అది ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం
వృక్షాసనం (చెట్టు భంగిమ)
చెట్టు భంగిమలో ఒక వ్యక్తి ఒక కాలు మీద నిలబడి..మరొక కాలును పైకి వంచి తొడపై పెట్ట్టుకోవాలి. తర్వాత నమస్కార రెండు చేతులను పైకి చాపండి. ఈ ఆసనం చూడటానికి తేలికగా ఉంటుంది. కానీ ఇలా చేయడానికి, సమతుల్యత , ఏకాగ్రత చాలా ముఖ్యం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది
వృక్షాసనం చేస్తున్నప్పుడు మొత్తం శరీరం ఒక కాలు మీద ఆనించి నిలబడాల్సి ఉంటుంది. ఇది సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది మెరుగైన స్థిరత్వం, పట్టును నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఏకాగ్రత
వృక్షాసన చేసేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇది చదువు విషయంలో ఏకాగ్రత, పనిలో చేసే సమయంలో మెరుగైన ప్రతిభను చూపించేలా చేస్తుంది.
భంగిమ సరిగ్గా ఉంటుంది
ట్రీ పోజ్ చేయడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఇది శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం చక్కగా ఆకారంలో కనిపిస్తుంది. ఇది శరీరంలో వశ్యత, బలం రెండింటినీ పెంచుతుంది.
ఒత్తిడి తక్కువగా ఉంటుంది
ట్రీ పోజ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రతను పెంచడమే కాదు ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఎందుకంటే దృష్టి , సమతుల్యతను ఉంచుకోవడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించవచ్చు.
కాళ్ళు , తొడలకు ప్రయోజనకరం
ఈ ఆసనం చేసే సమయంలో శరీరం మొత్తం బరువు ఒక కాలు మీద ఉంటుంది. ఇది కాళ్ళు, తొడలు , చీలమండల కండరాలను బలపరుస్తుంది. కనుక ఈ ఆసనం చేయడం వలన కాళ్ళు , తొడలు బలోపేతం అవుతాయి.
ట్రీ పోజ్ చేసేసమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర భంగిమను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆసనం తప్పుగా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అంతేకాదు కాళ్ళు లేదా నడుములో నొప్పి లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే.. ఈ ఆసనం చేసే ముందుగా నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








