AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!

పంటి నొప్పి అనేది మామూలు సమస్య అనిపించవచ్చు. కానీ అది కలిగించే ఇబ్బంది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నొప్పి మొదలైతే తినడం, మాట్లాడడం, నిద్రపోవడం అన్నీ కష్టమవుతాయి. ఈ సమయంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే కొన్ని పదార్థాలు పంటి నొప్పిని పెంచే ప్రమాదం కలిగి ఉంటాయి. అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!
Tooth Pain
Prashanthi V
|

Updated on: May 21, 2025 | 11:41 PM

Share

మీ దంతాలలో నొప్పి ఉంటే.. ముందుగా తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం అవసరం. చాక్లెట్లు, స్వీట్లు, బిస్కెట్లు వంటి వాటిలో ఉండే చక్కెరలు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. ఇవి పళ్ళపై దాడి చేసి క్యావిటీ ఏర్పడేలా చేస్తాయి. దీంతో నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ముఖ్యంగా నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.

ఐస్ వాటర్, సోడా, కోల్డ్ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్ లాంటివి తాగడం వల్ల మీ పళ్ళలోని నరాలపై దెబ్బ పడుతుంది. ఇది కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ముఖ్యంగా టూత్ సెన్సిటివిటీ ఉన్నవారు చల్లటి పదార్థాలను పూర్తిగా వదిలేయాలి.

నారింజ, మామిడిపండు, ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు ఆమ్లపదార్థాలతో నిండి ఉంటాయి. ఇవి పళ్ళ ఉపరితలాన్ని నెమ్మదిగా దెబ్బతీయడమే కాకుండా నొప్పిని పెంచే అవకాశమూ ఉంది. అందువల్ల పంటి సమస్యలు ఉన్నవారు ఈ రకమైన పండ్లను తినకుండా ఉండాలి.

పళ్ళలో నొప్పి ఉన్నప్పుడు గట్టి పదార్థాలను నమలడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. క్యారెట్, బీట్‌ రూట్ వంటి కూరగాయలు, అలాగే చికెన్ లేదా మటన్ ముక్కలను నమలడం వల్ల పళ్ళకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది నొప్పిని మించిపోయేలా చేస్తుంది. వీటిని మెత్తగా వండుకుని, ముద్దలా చేసుకుని తినడం మంచిది.

పంటి నొప్పిని తగ్గించుకోవాలంటే మీ బ్రషింగ్ పద్ధతిలోనూ మార్పులు చేయాలి. గట్టిగా బ్రష్ చేయడం వల్ల పళ్ళు మరింత సున్నితంగా మారతాయి. అందుకే సాఫ్ట్ బ్రిస్టల్ బ్రష్ ఉపయోగించాలి. అలాగే వేడి, చల్లటి పదార్థాలను కలిపి తినకూడదు. గోరువెచ్చటి పదార్థాలు మాత్రమే తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

పంటి నొప్పి అనేది చిన్న సమస్యగా కనిపించినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది పెద్ద ఇబ్బంది కావచ్చు. తీపి పదార్థాలు, చల్లటి పానీయాలు, పుల్లటి పండ్లు, గట్టి ఆహార పదార్థాల్ని పూర్తిగా మానేయడం ద్వారా నొప్పిని నియంత్రించుకోవచ్చు. అలాగే రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసి శుభ్రత పాటించడం వల్ల మీరు ఈ సమస్యను త్వరగా అదుపులోకి తీసుకురాగలరు.