GTPW: ఈ కంపెనీలు ఉద్యోగులకు స్వర్గధామాలు.. లిస్ట్‌లో ఉన్న కంపెనీలు ఇవే..!
పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటేనే ఉద్యోగులకు చేసే పనిమీద ఆసక్తి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని చేసే ఉద్యోగులకు 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' అనేది కేవలం ఒక ట్యాగ్ కాదు, నమ్మకంతో కూడిన ఒక భరోసా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమైన విషయం. ప్రతి సంవత్సరం ఫార్చ్యూన్ మీడియా..

పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటేనే ఉద్యోగులకు చేసే పనిమీద ఆసక్తి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని చేసే ఉద్యోగులకు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ అనేది కేవలం ఒక ట్యాగ్ కాదు, నమ్మకంతో కూడిన ఒక భరోసా. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమైన విషయం. ప్రతి సంవత్సరం ఫార్చ్యూన్ మీడియా, గ్రేట్ ప్లేస్ టు వర్క్ (GPTW)తో కలిసి ‘వరల్డ్స్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్’ లిస్ట్‌ను విడుదల చేస్తుంది.
తాజాగా 2025 సంవత్సరానికిగానూ ఈ జాబితాను విడుదల చేసింది. 25 మిలియన్ల ఉద్యోగుల అనుభవాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించి ఫలితాన్ని ప్రకటించింది. ఈ సర్వేలో ఉద్యోగులు తమ కంపెనీల వర్క్ కల్చర్‌ను రేట్ చేశారు, ఫలితంగా, టాప్ 25 కంపెనీలు ఎంపిక అయ్యాయి. ఈ కంపెనీల్లో 90% ఉద్యోగులు తమ పని చోటను ‘గ్రేట్’గా అభివర్ణించారు, 86% మంది దీర్ఘకాలం ఉండాలని కోరుకున్నారు.
2025 ఫార్చ్యూన్ వరల్డ్స్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్ టాప్ 25 లిస్ట్‌లో హిల్టన్, DHL ఎక్స్‌ప్రెస్, సిస్కో, యాక్సెంచర్, అబ్వీ, మారియట్ ఇంటర్నేషనల్, టీపీ (S.C. జాన్సన్), సేల్స్‌ఫోర్స్, స్ట్రైకర్, మెట్‌లైఫ్, స్పెక్ సేవర్స్, సీమెన్స్ హెల్త్‌నీర్స్, సర్వీస్‌నౌ, ఎక్స్‌పీరియన్, ఎన్విడియా, కేడెన్స్, డవ్, అలియాంజ్, వైయాట్రిస్, అడోబీ, క్రౌడ్‌స్ట్రైక్, ఎస్‌సీ జాన్సన్, హిల్టి, ట్రెక్ బైసికల్, అడ్మిరల్ గ్రూప్ వంటి 25 గొప్ప కంపెనీలు ఉన్నాయి.
ఈ లిస్ట్‌లో టూరిజం (హిల్టన్, మారియట్), ఐటీ (సిస్కో, ఎన్విడియా), హెల్త్‌కేర్ (అబ్వీ, స్ట్రైకర్), ఫైనాన్స్ (మెట్‌లైఫ్, అలియాంజ్), మ్యాన్యుఫాక్చరింగ్ (టీపీ) రంగాలు డామినేట్ అవుతున్నాయి. భారత్‌లో యాక్సెంచర్, సిస్కో, ఎన్విడియా, అడోబీ, సేల్స్‌ఫోర్స్ వంటివి ఆపరేట్ చేస్తున్నాయి, ఇక్కడి ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ పాలసీలు, డైవర్సిటీ ప్రోగ్రామ్స్ ఆకర్షణీయం.
ఎలా ఎంపిక చేస్తారు?
ఈ సర్వేలో పాల్గొనేందుకు పలు నియమాలు ఉంటాయి. సర్వేలో పాల్గొనే కంపెనీలో కనీసం 5,000 గ్లోబల్ స్థాయిలో ఉద్యోగులు ఉండాలి, 2024 లేదా 2025 ప్రారంభంలో ఆసియా, యూరప్, ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలో కనీసం 5 బెస్ట్ వర్క్‌ప్లేస్ లిస్ట్‌ల్లో ఉండాలి.
ట్రస్ట్ (మేనేజ్‌మెంట్‌పై నమ్మకం), ప్రైడ్ (వర్క్‌పై గర్వం), కామరాడరీ (కలిసి పని చేయడం) – ఈ మెట్రిక్స్‌పై స్కోర్ ఆధారంగా ర్యాంక్ చేస్తారు. ఈ కంపెనీలు ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, అజైలిటీలో తోటి కంపెనీల కంటే ముందుంటాయి. ఈ జాబితాలో మన దేశపు కంపెనీలూ చోటు దక్కించుకోవడం ఆనందించదగిన విషయం.




