Kitchen Hacks: ఈ నూనెలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు..

వర్షాకాలం వచ్చిందంటే అనేక కీటకాలు ఇంట్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చీమలు, దోమలు, బొద్దింకలు, బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కీటకాల వలన ఖచ్చితంగా అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి అనేక మస్కిటో కాయిన్స్‌, అగరత్తులు, లిక్విడ్‌లు ఉపయోగిస్తారు. కానీ వీటి నుంచి వచ్చే పొగను..

Kitchen Hacks: ఈ నూనెలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు..
Kitchen Hacks
Follow us

|

Updated on: Sep 08, 2024 | 12:50 PM

వర్షాకాలం వచ్చిందంటే అనేక కీటకాలు ఇంట్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చీమలు, దోమలు, బొద్దింకలు, బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కీటకాల వలన ఖచ్చితంగా అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి అనేక మస్కిటో కాయిన్స్‌, అగరత్తులు, లిక్విడ్‌లు ఉపయోగిస్తారు. కానీ వీటి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల ఇతర శ్వాస కోశ సమస్యలు, చర్మ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎలాంటి రసాయనాలు వాడకుండా కొన్ని రకాల ఆయిల్స్‌తో దోమల బెడదను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప నూనె:

వేప పోషకాల పుట్ట అని చెప్పొచ్చు. వేపతో ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. వేప నూనెతో మనం దోమల సమస్య తగ్గించుకోవచ్చు. రాత్రి పూట ఒక స్ప్రే డబ్బాలో వేప నూనె, చిన్న కప్పుడు నీళ్లు పోసి బాగా షేక్ చేయండి. ఇప్పుడు దీంతో మూలల్లో, మంచాల కింద, దోమలు ఎక్కువగా తిరిగి చోట స్ప్రే చేస్తే.. ఎక్కువగా దోమలు కుట్టకుండా ఉంటాయి. అయితే కొంత మందికి ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు చెక్ చేసి వాడుకోవడం మంచిది.

టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్‌తో కూడా మనం దోమల సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ ఆయిల్‌ వాసన.. దోమలకు అస్సలు నచ్చదు. అంతే కాక టీ ట్రీ ఆయిల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల వచ్చే దద్దర్లు కూడా ఈ ఆయిల్‌తో తగ్గించుకోవచ్చు. అర కప్పు కొబ్బరి నూనెలో‌ పది చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి ఇళ్లంతా స్ప్రే చేయండి. ఈ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

లెమన్ యూకలిప్టస్ ఆయిల్:

లెమన్ యూకలిప్టస్ ఆయిల్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఆయిల్‌ని రాత్రి పూట ఉపయోగించాలి. ఒక స్ప్రే బాటిల్‌లో కప్పుడు నీళ్లు, కొద్దిగా ఈ ఆయిల్ కలిపి బాగా షేక్ చేయాలి. ఆ తర్వాత ఇల్లంతా ఒకసారి స్ప్రే చేయండి. ఈ వాసనకు కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు