Kitchen Hacks: చలి కాలం వచ్చేసింది.. ఈ సీజన్‌లో ఆహారం వేడిగా ఉంచుకోవడానికి కొన్ని స్వదేశీ చిట్కాలు..
చలికాలం వచేసింది. చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి ఆహారం తినాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్‌లో అతి పెద్ద సమస్య ఏమిటంటే.. వంట చేసిన కొన్ని నిమిషాల్లో ఆహారపదార్ధాలు అన్నీ చల్లగా అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఆహారాన్ని ఎక్కువసేపు వెచ్చగా ఉంచడానికి కొన్ని వంటింటి చిట్కాలను అనుసరించవచ్చు. ఈ చిట్కాల గురించి తెలుసుకుందాం...
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అదే సమయంలో అనేక ఆరోగ్య సవాళ్లను కూడా తీసుకువస్తుంది. చలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వెచ్చదనం కలిగించే దుస్తులు ధరిస్తాము. అయితే వండిన వెంటనే ఆహారం చల్లబడుతుంది. అన్నం, పప్పు, కూరలు ఇలా ఏవైనా సరే తక్కువ సమయంలోనే చల్లబడతాయి. అలా చల్లగా మారిన ఆహారం తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో ఈ రోజు శీతాకాలంలో ఎక్కువసేపు ఆహరం వెచ్చగా ఉంచడం ఎలా తెలుసుకుందాం.
ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం చాలా పెద్ద పని. అంతేకాదు ఇలా చేయడం వలన ఆహారంలోని పోషకాలు నాశనం అవుతాయి. అయితే ఈ సమస్యను నివారించడానికి సింపుల్ చిట్కాలను అనుసరించవచ్చు. ఈ రోజు సింపుల్ అండ్ ఈజీ టిప్స్ చెప్పబోతున్నాము. ఇవి శీతాకాలంలో ఆహారాన్ని ఎక్కువ సమయం వేడిగా ఉంచుతాయి.
అల్యూమినియం ఫాయిల్:
ఆహారాన్ని వెచ్చగా ఉంచడానికి మనం తరచుగా అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగిస్తాము. దాని పొరను ఆహరం వండిన పాత్రపై ప్లేట్ లా కవర్ చేస్తే.. ఎక్కువ సమయం ఆహారం వేడిగా ఉంటుంది. అలాగే రోటీలు , పరాటాలు అయితే వీటిని పేపర్ ర్యాప్‌లో పెట్టి వాటిని చుట్టండి. తర్వాత అల్యూమినియం రేకు చుట్టి నిల్వ చేసుకొండి. ఇలా చేయడం వల్ల ఉదయం చేసిన రోటీలు మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటాయి.
థర్మల్ బాక్స్
థర్మల్ బాక్స్ ల సహాయంతో ఆహారాన్ని వెచ్చగా ఉంచవచ్చని మీకు తెలుసా. థర్మోప్లాస్టిక్ నుంచి థర్మల్ బ్యాగులను తయారు చేస్తారు. ఈ బాక్స్ లోపల ఆహార పదార్ధాల గిన్నెలను పెట్టి మూత పెడితే ఆహారంలోని వేడిని ఈ బాక్స్ బయటకు వెళ్ళనివ్వదు. దీనివల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఈ బాక్స్ ధర కూడా అందుబాటులో ఉంటుంది.
కాంస్య లేదా ఇత్తడి పాత్రలు
శీతాకాలంలో కంచు లేదా ఇత్తడితో చేసిన పాత్రలలో కూడా ఆహారాన్ని ఉంచవచ్చు. చలికాలంలో ఆహారాన్ని గోరువెచ్చగా ఉంచేందుకు ఈ సంప్రదాయ పాత్రలు ఉత్తమ ఎంపిక. ఇవి ఆహారాన్ని వెచ్చగా ఉంచడమే కాదు భోజనానికి మంచి రుచుని కూడా అందిస్తాయి. ఇప్పటి వరకు కంచు మరియు ఇత్తడి పాత్రలను వాడకుండా పెట్టెలో ఉంచినట్లయితే.. ఈ సీజన్ లో వాటిని బయటకు తీసి ఉపయోగించే సమయం ఆసన్నమైంది.
ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా మైక్రోవేవ్ లేకుండా శీతాకాలంలో మీ ఆహారాన్ని ఎక్కువ సమయం వెచ్చగా ఉంచుకోవచ్చు. దీంతో ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.