
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రజలు సాధారణంగానే ఈ విటమిన్ కోసం మాత్రమే నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, విటమిన్ సి తో పాటు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా నిమ్మకాయలో సమృద్ధిగా ఉన్నాయని మీకు తెలుసా. దీనితో పాటు దానిలో లభించే ఖనిజాలు కలిసి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ప్రజలు ఎక్కువగా వేసవిలో నిమ్మకాయ నీటిని తీసుకుంటారు. దీనిని తాగడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. శక్తిని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో శీతాకాలంలో నిమ్మకాయ నీటిని తాగవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది? మీరు కూడా డౌంట్‌తో ఉన్నారా..? అయితే, చలికాలంలో కూడా నిమ్మకాయ నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, మీరు దానిని సరైన పద్ధతిలో మాత్రమే తీసుకోవాలని అంటున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం..
శీతాకాలంలో నిమ్మకాయ నీరు ఎలా తాగాలి..?
మీరు శీతాకాలంలో నిమ్మకాయ నీటిని తీసుకోవాలంటే, గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. వాతావరణం కొంచెం మెరుగ్గా ఉన్నప్పుడు ఉదయం 10-11 గంటల మధ్య తీసుకోవచ్చు. నిమ్మకాయ నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శీతాకాలంలో కూడా దీనిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం నిర్విషీకరణకు సహాయపడుతుంది. విషవ్యర్థాలు సులభంగా తొలగిస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది జీర్ణవ్యవస్థ అస్తవ్యస్థంగా మారుతుంది. అలాంటి వారు నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మం లోపలి నుండి మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అయితే, నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, అధిక వినియోగం శరీరానికి హాని కలిగిస్తుంది. చలికాలంలో నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల సున్నితత్వం సమస్య పెరుగుతుంది. అసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు, శీతాకాలంలో నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మితంగా తీసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…