Health Tips: మొబైల్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Mobile Phone  Under  Pillow: ఉదయం లేవగానే మనలో చాలా మంది ముందుగా ఫోన్ వైపు చూస్తారు. రాత్రి పూట కూడా పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూసుకుని నిద్రపోతాం. అయితే మొబైల్ చూసిన తర్వాత చాలామంది పక్కన పెట్టుకుంటారు.

Health Tips: మొబైల్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Mobile Phone Under Pillow
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2022 | 9:25 PM

Mobile Phone  Under  Pillow: ఉదయం లేవగానే మనలో చాలా మంది ముందుగా ఫోన్ వైపు చూస్తారు. రాత్రి పూట కూడా పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూసుకుని నిద్రపోతాం. అయితే మొబైల్ చూసిన తర్వాత చాలామంది పక్కన పెట్టుకుంటారు. మరికొందరు దిండు కింద పెట్టుకుని నిద్రపోతారు. అయితే ఇలా మొబైల్‌ను దిండు కింద పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి సంబంధించి పలు రకాల పరిశోధనలు చేసింది. మొబైల్ వల్ల వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇది నిద్రకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందట. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పెద్దల కంటే పిల్లలకు బాగా హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్లూ లైటింగ్‌ తో.. మొబైల్‌ని దిండు కింద పెట్టుకుని పడుకునేటప్పుడు దాని బ్లూ లైట్ మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాల్స్‌ లేదా మెసేజ్‌ వచ్చినప్పుడల్లా రింగ్ టోన్ ప్లే అయినప్పుడల్లా చీకట్లో ఫోన్‌లోని బ్లూ లైట్‌ వెలుగుతుంది. ఇలా పదే పదే బ్లూ లైట్‌ చూడటం వల్ల కళ్లకు హాని కలుగుతుంది.

ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోతే.. ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే అతి పెద్ద ప్రమాదం మొబైల్‌ పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొబైల్‌ బ్యాటరీ ఎక్కువగా హీట్‌ కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే చాలామంది నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోతుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం.

ఇవి కూడా చదవండి

నిద్రకు తీవ్ర ఆటంకం.. కాగా పరిశోధనల ప్రకారం.. రాత్రివేళల్లో తరచూ ఫోన్‌ మోగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈసమయంలో వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శరీరాన్ని త్వరగా అలసిపోయేలా చేస్తుందట. ఇదిక్రమంగా మన పని తీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. కాబట్టి రాత్రి వేళల్లో మొబైల్‌ను దూరంగా ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..