ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనిపిస్తుంది? అందుకు మీ అలవాట్లే కారణమా?
ఇటీవల కాలంలో చాలా మంది జనం మధ్యలో ఉన్నప్పటికీ ఒంటరిగానే ఫీలవుతున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, సోషల్ మీడియా.. ఇవన్నీ ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియని ఆవేదన. అసలు ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది? నిజంగా మనం ఒంటరిగా ఉన్నామా? లేక మన అలవాట్లే ఇందుకు కారణమా? ఈ విషయాన్ని తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలా మంది చుట్టూ జనాలు ఉన్నా కూడా ‘ఒంటరిగా ఉన్నట్టు’ అనుభూతి చెందుతున్నారు. కుటుంబం, స్నేహితులు, సోషల్ మీడియా.. అన్నీ ఉన్నప్పటికీ మనసులో ఖాళీగా, దూరంగా ఉన్న భావన కలుగుతోంది. అసలు ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది? నిజంగా మనం ఒంటరిగా ఉన్నామా? లేక మన అలవాట్లే ఇందుకు కారణమా? ఈ విషయాన్ని లోతుగా తెలుసుకుందాం.
ఒంటరితనం అంటే ఏమిటి?
ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండటమే కాదు. మన భావాలు ఎవరికీ అర్థం కావట్లేదని అనిపించడం, మనకు నిజమైన అనుబంధం లేదని భావించడం, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని అనిపించడం.. ఇవన్నీ ఒంటరితనానికి లక్షణాలు.
మన అలవాట్లే ఒంటరితనానికి కారణమా?
చాలా సందర్భాల్లో అవుననే చెప్పాలి. మనం తెలియకుండానే కొన్ని అలవాట్ల ద్వారా మనల్ని మనమే దూరం చేసుకుంటుంటాం.
భావాలను దాచిపెట్టే అలవాటు
“ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు” అన్న భావనతో మన బాధలను లోపలే దాచుకుంటాం. ఇలా చేయడం వల్ల మనసులో భారంగా మారి, ఇతరులతో దూరం పెరుగుతుంది.
ఇతరులతో పోల్చుకోవడం
సోషల్ మీడియాలో కనిపించే “సంతోషం” నిజం కాదని తెలిసినా.. వాళ్ల జీవితం మనకంటే బాగుందని భావించడం. మన విలువను మనమే తగ్గించుకోవడం. ఇవి ఒంటరితనాన్ని మరింత పెంచుతాయి.
అవసరం లేనంత ఒంటరిగా ఉండటం
ఒంటరిగా ఉండటం కొంతవరకు మంచిదే. కానీ అదే అలవాటుగా మారితే.. మనం మనకే పరిమితమవుతాం. కొత్త అనుభవాలు, మనుషులు దూరమవుతారు.
నమ్మకాన్ని కోల్పోవడం
గత అనుభవాల వల్ల “ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు”, “అందరూ స్వార్థపరులే” అన్న భావన ఏర్పడితే, మనమే సంబంధాల నుంచి వెనక్కి వెళ్లిపోతాం.
‘నేనే అన్నీ చూసుకుంటాను’ అనే భావన
సహాయం అడగడం బలహీనత కాదని తెలిసినా.. ఎవరినీ ఆశ్రయించకుండా అన్నీ మనమే చేయాలనుకోవడం, ఇది మనల్ని భావోద్వేగంగా ఒంటరిగా చేస్తుంది.
ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఏమి చేయాలి?
మీ భావాలను చెప్పడం నేర్చుకోండి. ఒక వ్యక్తితో అయినా సరే, మనసు విప్పి మాట్లాడడం చాలా అవసరం.
పరిపూర్ణత కోసం కాకుండా, నిజమైన అనుబంధం కోసం చూడండి ప్రతి సంబంధం పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మీతో మీరు స్నేహం చేసుకోండి మీకు నచ్చిన పనులు చేయండి.. చదవడం, నడక, సంగీతం, ధ్యానం వంటివి. వర్చువల్ కనెక్షన్లకంటే, నిజమైన సంభాషణలు ఎక్కువ చేయండి. సహాయం అడగడంలో సంకోచించవద్దు కౌన్సిలర్, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడితో మాట్లాడటం మీకు మంచిది.
ఒంటరితనం చెడు కాదు… కానీ, ఒంటరితనం మనకు మనల్ని తెలుసుకునే అవకాశం ఇస్తుంది. కానీ, అది మనల్ని బాధపెట్టే స్థాయికి చేరితే, అది మార్పు అవసరమనే సంకేతం ఇస్తుంది.
ఒంటరిగా ఉన్నామని అనిపించడం మన తప్పు కాదు. కానీ ఆ భావనను కొనసాగించాలా? మార్చుకోవాలా? అనే నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. చిన్న అలవాట్లను మార్చుకుంటే, అనుబంధాలు పెరుగుతాయి. మనసు తేలికగా మారుతుంది. జీవితం మళ్లీ అర్థవంతంగా అనిపిస్తుంది. అందుకే ఒంటరితనం అనే భావనను మీ మనసులోంచి క్రమంగా తీసేయండి.
