AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌‌లో ఈ నీటితో వడదెబ్బ నుంచి రక్షణ! డీహైడ్రేషన్, ఇన్ డైజెషన్‌ ప్రాబ్లమ్స్‌కు చెక్

మట్టి కుండలో నీరు నిల్వ చేయడం వల్ల అది కేవలం చల్లబడటమే కాకుండా, నీటి నాణ్యత కూడా పెరుగుతుంది. మట్టిలో ఉండే సహజ సిద్ధమైన ఖనిజ లవణాలు నీటిలోకి చేరి, మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫైర్ల కంటే ప్రకృతి సిద్ధమైన మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ వేసవిలో మీ ఇంట్లో ఒక మట్టి కుండను ఏర్పాటు చేసుకుని, చల్లని, ఆరోగ్యకరమైన నీటిని తాగమని సూచిస్తున్నారు నిపుణులు.

సమ్మర్‌‌లో ఈ నీటితో వడదెబ్బ నుంచి రక్షణ! డీహైడ్రేషన్, ఇన్ డైజెషన్‌ ప్రాబ్లమ్స్‌కు చెక్
Clay Pot Water.jpg
Nikhil
|

Updated on: Mar 22, 2026 | 10:07 AM

Share

వేసవి కాలం రాగానే భానుడి భగభగలు మొదలవుతాయి. ఈ సమయంలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఫ్రిజ్ నీటి వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా, మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ‘మట్టి కుండ’ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మట్టి కుండను ‘పేదవాడి ఫ్రిజ్’ అని పిలిచినప్పటికీ, అందులోని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి.

సహజ సిద్ధమైన వడపోత..

మట్టి కుండకు ఉండే సూక్ష్మ రంధ్రాలు నీటిని సహజంగా వడపోస్తాయి. ఇది నీటిలోని మలినాలను తొలగించడమే కాకుండా, హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రిజ్ నీటిలా కాకుండా, కుండ నీరు బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లబడుతుంది, దీనివల్ల శ్వాసకోశ సమస్యలు లేదా జలుబు చేసే ప్రమాదం ఉండదు.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • మట్టి కుండ నీరు తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
  • ఈ నీరు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వేసవిలో ఎండల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, వడదెబ్బ నుండి రక్షించుకోవడానికి ఇది ఒక అద్భుత ఔషధం.
  • మట్టిలో ఉండే విటమిన్లు, మినరల్స్ నీటిలో కలవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • వేసవిలో చెమట వల్ల వచ్చే చర్మ సమస్యలను, జిడ్డును తగ్గించడంలో కుండ నీరు సహకరిస్తుంది.
  • మట్టిలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, కుండ నీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.

Follow Us