Guava Leaves For Hair : జామ ఆకులతో ఇలా చేస్తే.. నెల రోజుల్లోనే తెల్లజుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..

ఇలా చేస్తే.. జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తవు. జుట్టు కుదుళ్లు దృఢంగా తయారు అవుతాయి. అలాగే క్రమంగా మీ జుట్టు నల్లగా అవుతుంది. జుట్టు మెరిసేందుకు జామ ఆకులతో చేసిన నీరు బాగా ఉపయోగపడుతుంది. కేవలం కేశ సంరక్షలో మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా జామ ఆకులు చాలా మంచివి. వీటి ఉపయోగంతో జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Guava Leaves For Hair : జామ ఆకులతో ఇలా చేస్తే.. నెల రోజుల్లోనే తెల్లజుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..
Guava Leaves For Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2024 | 7:22 AM

ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆకులో ఔషధ విలువలు ఉన్నాయి. అదేవిధంగా జామ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని సమస్యలకు దీన్ని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది క్యాన్సర్ నుండి మధుమేహం వరకు అన్నింటిని నయం చేస్తుంది. జామ ఆకు అనేక ఔషధ గుణాలను కలిగి ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది… జామ ఆకుల్లో విటమిన్ సి, నీరు, పీచు వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. జామ ఆకుల ఉపయోగంతో చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. జామ ఆకుల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడేందుకు జామ ఆకులు ఉపయోగపడతాయి.

రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు.. దీని కోసం ఎన్నో రెమెడీస్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.. అలాంటి వారి కోసం ఇది బెస్ట్ వైట్ హెయిర్ హోం రెమెడీ. జామ ఆకులతో జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. తెల్ల వెంట్రుకలు పోవాలంటే 5 జామ ఆకులు, 20 కరివేపాకులు, 200 మి.లీ కొబ్బరినూనె తీసుకోవాలి. ముందుగా పాన్‌లో కొబ్బరి నూనె వేసి సిద్ధం చేసుకున్న పదార్థాలను మిక్స్ చేసి మీడియం మంట మీద వేయించాలి. తర్వాత నూనె చల్లారాక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ రెమెడీ మీ జుట్టు చుండ్రు, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలను ఒక నెలలో తొలగిస్తుంది.

మరో విధంగా కూడా జామ ఆకులను జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు.. ఇందుకోసం కొన్ని జామ ఆకులను తీసుకుని లీటరు నీటిలో 20 నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీటిని దించాలి. గోరు వెచ్చని నీటిని జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తవు. జుట్టు కుదుళ్లు దృఢంగా తయారు అవుతాయి. అలాగే క్రమంగా మీ జుట్టు నల్లగా అవుతుంది. జుట్టు మెరిసేందుకు జామ ఆకులతో చేసిన నీరు బాగా ఉపయోగపడుతుంది. కేవలం కేశ సంరక్షలో మాత్రమే కాదు… ఆరోగ్యానికి కూడా జామ ఆకులు చాలా మంచివి. వీటి ఉపయోగంతో జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి