Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: ఆ సమయంలో ఎందుకిలా..? అమ్మాయిలు తెలుసుకోవల్సిన విషయం ఇది..

ప్రతి నెలా ఠంచన్‌గా పలకరించే నెలసరి అమ్మాయిలకు నరకంలా ఉంటుంది. చాలామంది ఈ సమయంలో అసౌకర్యానికి గురవుతుంటారు. అధిక బ్లీడింగ్‌, శారీరక నొప్పులు, మూడ్‌ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొంత మంది అమ్మాయిలకు పీరియడ్స్ ముందు తరువాత తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక అమ్మాయిలు కంగారు పడుతుంటారు..

Women Health: ఆ సమయంలో ఎందుకిలా..? అమ్మాయిలు తెలుసుకోవల్సిన విషయం ఇది..
White Discharge Before Period
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2025 | 1:24 PM

నెలనెలా ఠంచన్‌గా పలకరించే నెలసరి అమ్మాయిలకు నరకంలా ఉంటుంది. చాలామంది ఈ సమయంలో అసౌకర్యానికి గురవుతుంటారు. అధిక బ్లీడింగ్‌, శారీరక నొప్పులు, మూడ్‌ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొంత మంది అమ్మాయిలకు పీరియడ్స్ ముందు తరువాత తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక అమ్మాయిలు కంగారు పడుతుంటారు. అసలు తెల్లటి స్రావం ఎందుకు వస్తుంది? ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక కారణం ఏమిటి? మీకు కూడా అలాంటి సమస్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

ఋతుచక్రానికి ముందు, తరువాత తెల్లటి ఉత్సర్గ అనేది ఒక సాధారణ శారీరక ప్రక్రియ. ఇది హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. ఈ స్రావం గర్భాశయం, యోని పరిశుభ్రతను కాపాడటంలో సహాయపడుతుంది. పీరియడ్స్‌లో రక్త స్రావం పరిమాణంలో హెచ్చుతగ్గులకు కూడా కారణం అవుతుంది. సాధారణంగా పీరియడ్స్ కు ముందు తెల్లటి స్రావం వస్తుంది. ఇది ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల వస్తుంది. పీరియడ్స్ తర్వాత ఇది లైట్‌గా మారుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరం ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది. ఈ డిశ్చార్జ్ దుర్వాసనగా, దురదగా ఉంటే.. అలాంటప్పుడు ఏం చేయాలంటే..

ఈ తెల్లటి స్రావాలు దుర్వాసన, దురద, చికాకు లేదా రంగులో మార్పు (ఆకుపచ్చ లేదా పసుపు వంటి రంగు)తో కూడి ఉంటే అది ఇన్ఫెక్షన్ అని అర్ధం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి పరిశుభ్రత పాటించడం, తగినంత నీరు తాగడం ద్వారా పీరియడ్స్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకూ తెల్లటి స్రావం వస్తుంటే.. దాని రంగు గోధుమ లేదా పసుపు రంగులో ఉంటే ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ఈ స్రావం మందంగా, ముద్దగా ఉన్నా.. అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ (అంటు సమస్యలు)కు సంకేతం కావచ్చు. ఇలాంటి వారు కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!