శీతాకాలంలో ఈ కూరగాయలను మీరూ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా?

చాలామంది వారానికి అవసరమైన అన్ని పండ్లు, కూరగాయలను ఒకేసారి మార్కెట్‌ నుంచి తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అలవాటు. శీతాకాలంలో కూడా, వాతావరణం ఎంత చల్లగా ఉన్నా వారానికి సరిపడా పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఈ కూరగాయలలో కొన్నింటిని శీతాకాలం..

శీతాకాలంలో ఈ కూరగాయలను మీరూ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా?
Vegetables For Fridge In Winter

Updated on: Dec 18, 2025 | 12:59 PM

చాలామంది వారానికి అవసరమైన అన్ని పండ్లు, కూరగాయలను ఒకేసారి మార్కెట్‌ నుంచి తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అలవాటు. శీతాకాలంలో కూడా, వాతావరణం ఎంత చల్లగా ఉన్నా వారానికి సరిపడా పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఈ కూరగాయలలో కొన్నింటిని శీతాకాలంలో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటిల్లోని పోషకాలు అంతరించి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి కూరగాయలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

శీతాకాలంలో ఏ కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదంటే..

వెల్లుల్లి, ఉల్లిపాయలు

వెల్లుల్లి, ఉల్లిపాయలను నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం వంటగదిలో ఒక చిన్న బుట్టలో ఉంచడం. గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీరు వాటిని తొక్క తీసి లేదా పేస్ట్ చేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే వాటి పోషక విలువలు తగ్గుతాయి.

టమోటా

ప్రతి వంటలోనూ టమోటాలు ఉపయోగించడం గృహిణులకు అలవాటు. అయితే చాలామంది ఈ టమోటాలను కూడా శీతాకాలంలో ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేస్తారు. వీటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, తాజాదనం రెండూ చెడిపోతాయట. పైగా టమోటాలలోని యాంటీఆక్సిడెంట్లు కూడా నాశనమవుతాయి. శీతాకాలంలో బయట ఉంచినా టమోటాలు ఒక వారం పాటు చెడిపోవు.

ఇవి కూడా చదవండి

బంగాళాదుంపలు

చాలా మంది బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి మొలకెత్తడమే కాకుండా వాటిలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులనే కాకుండా అందరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

అల్లం

అల్లం అనేది శీతాకాలంలో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడని మరో కూరగాయ. మీరు దానిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే దానిలో శిలీంధ్రాలు పెరిగి చెడిపోతాయి. ఈ రకమైన అల్లం తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై హానికరమైన ప్రభావాలు ఉంటాయి.

ఆకుకూరలు

ఆకుపచ్చ కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో 12 గంటలు మాత్రమే నిల్వ ఉంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంత కంటే ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచి, పోషక విలువలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే కాలీఫ్లవర్, క్యారెట్‌లను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.