మీకు కూడా జట్టు రాలుతుందా..? కారణం అదేనట.. పెద్ద కథే.. కానీ ఇలా చేస్తే..

జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ సాధారణమైన సమస్యగా మారింది. చాలా సార్లు మనం ఈ సమస్య వెనుక గల కారణాలను అర్థం చేసుకోలేము.. దానికి వివిధ విషయాలను ఊహించుకుంటూ నిందించడం ప్రారంభిస్తాము. అటువంటి పరిస్థితిలో, తరచుగా తలెత్తే ప్రశ్న ఏమిటంటే.. నీటిని మార్చడం వల్ల కూడా జుట్టు రాలుతుందా?.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

మీకు కూడా జట్టు రాలుతుందా..? కారణం అదేనట.. పెద్ద కథే.. కానీ ఇలా చేస్తే..
Hairfall
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2025 | 1:01 PM

నేటి కాలంలో జుట్టు రాలడం అనేది సర్వసాధారణమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ సమస్యతో పోరాడుతున్నారు. ఈ సమస్య ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉండవచ్చు.. వాటిలో ఒకటి ఏమిటంటే.. వారు తమ ఇంటిని వదిలి లేదా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లినప్పుడు.. వారు అక్కడ ఉపయోగించే స్నానం చేసే నీరు జుట్టు రాలడానికి కారణమవుతుందని నమ్ముతారు.. అయితే ఇది నిజంగా అలా జరుగుతుందా..? జట్టు రాలడానికి నీరే కారణమా..? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకోండి..

మీరు కొత్త నగరానికి వెళ్లి నప్పుడు.. లేదా.. ఇల్లు మారినప్పుడు జుట్టు రాలడం లాంటి సమస్య ప్రారంభమైతే, అది నీరు మారడం వల్ల కావచ్చని.. నీరు నాణ్యతగా లేకపోవడం కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు ఏం చెబుతున్నారు.. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

నీటిని మార్చడం వల్ల జుట్టు రాలిపోతుందా?

శ్రీబాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని చర్మవ్యాధి నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విజయ్ సింఘాల్ మాట్లాడుతూ.. జుట్టు బలహీనపడటానికి లేదా జట్టు రాలడానికి కారణం నీరు మారడం కాదని.. కానీ నాణ్యత లేని నీరు జట్టు రాలేలా చేస్తుందన్నారు. జుట్టు రాలడానికి లేదా బలహీనంగా మారడానికి నాణ్యత లేని నీరు ప్రధాన కారణమన్నారు.

నీటిలో అధిక మొత్తంలో క్లోరిన్, కాల్షియం, మెగ్నీషియం వంటి గట్టి లోహాలు లేదా ధూళి ఉంటే.. అది జుట్టు, తలకు హాని కలిగిస్తుంది. మీరు అలాంటి నీటితో జుట్టును శుభ్రం చేయడం వలన.. జుట్టు నుంచి తేమను తొలగించడం ద్వారా జుట్టు పొడిగా చేయవచ్చు. దీని కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది.. విరిగిపోతుంది. అదనంగా, ఇది జుట్టు సహజ నూనెలను కూడా తొలగించగలదు.. దీనిద్వారా జట్టు రాలడం సమస్య మరింత పెరుగుతుంది..

జట్టు రాలడాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

నీటిని శుద్ధి చేయడానికి ఫిల్టర్ లేదా నీటి మృదుల పరికరాన్ని ఉపయోగించండి. ఇది నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది. జుట్టుకు హాని కలిగించదు.

జుట్టు తేమను నిర్వహించడానికి మాయిశ్చరైజర్ ఉన్న షాంపూ, కండీషనర్ ఉపయోగించండి. ఇది జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది.

వారానికి ఒకసారి కొబ్బరి, ఉసిరి లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.. స్కాల్ప్ తేమగా ఉంటుంది.

మంచి జుట్టు ఆరోగ్యం కోసం, మీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి.

జట్టు అధికంగా రాలుతున్నా.. సమస్య పెరుగుతున్నా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..