Sleep Disorder: దేశంలో 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. వీరిలో మీరూ ఉన్నారా.?
నిద్రలేమితో బాధపడే సమస్యను స్లీప్ డిజార్డర్‌గా పిలుస్తున్నారు. తాజా గణంకాల ప్రకారం భారత్‌లో సుమారు 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో 10 కోట్ల మంది ప్రజలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ వ్యాధితో బాధపడేవారిలో నిద్రించే సమయంలో శ్వాస...

మారుతోన్న జీవనశైలి కారణంగా మని జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు హాయిగా నిద్ర పోవడం కూడా గొప్పగా మారిపోయింది. పడుకోగానే నిద్ర పడితే ‘అబ్బ వాడు అదృష్టవంతుడు.. పడుకొనే ఎంచక్కా నిద్ర పడుతుంది’ అనుకునే రోజులు వచ్చేశాయ్. ప్రస్తుతం నిద్రలేమి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. రోజురోజుకీ ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియా వినియోగం పెరగడం, జీవన విధానం మారడం కారణం ఏదైనా చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు.
నిద్రలేమితో బాధపడే సమస్యను స్లీప్ డిజార్డర్‌గా పిలుస్తున్నారు. తాజా గణంకాల ప్రకారం భారత్‌లో సుమారు 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో 10 కోట్ల మంది ప్రజలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ వ్యాధితో బాధపడేవారిలో నిద్రించే సమయంలో శ్వాస ప్రక్రియ సరిగ్గా ఉండదు, గురక వస్తుంది. ఈ కారణాల వల్ల క్వాలిటీ స్లీప్ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
దేశంలోని పెద్ద వారిలో సుమారు 11 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఏయిమ్స్ రెండు దశాబ్ధాల కాలంలో మొత్తం 6 పరిశోధనలు చేసి ఈ డేటాను విడుదల చేసింది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కేసులు పురుషులలో ఎక్కువగా సంభవిస్తున్నాయని పరిశోధనలో తేలింది. దీనివల్ల రాత్రిపూట నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ఈ ప్రభావం ఉదయం చేసే పనులపై పడుతుంది. ఈ నిద్రలేమి మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులకు దారి తీస్తుంది. ఈ విఱాలను జర్నల్ ఆఫ్ స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధన నిర్వహించిన ఎయిమ్స్ న్యూఢిల్లీలోని పల్మోనాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనంత్ మోహన్ మాట్లాడుతూ.. భారతదేశంలో 10 కోట్ల మందికి ఈ స్లీపింగ్ డిజార్డర్ ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. వీరిలో దాదాపు 5 కోట్ల మందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యాధితో పురుషులతో పాటు స్త్రీలలోనూ ఊబకాయం పెరుగుతుంది. ఈ ఈ వ్యాధి కారణంగా మనిషి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.
పక్షవాతం, అధిక రక్తపోటు, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. వృద్ధులకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ మోహన్ వివరించారు. నిద్ర భంగం కారణంగా, శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయి. వృద్ధులే కాకుండా ఊబకాయంతో బాధపడేవారికి కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందిని తెలిపారు. రాత్రిపూట విపరీతమైన గురక, శ్వాసకోస ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..