Long Covid : లాంగ్ కొవిడ్ అంటే ఏమిటీ..? దాని సిమ్‌టమ్స్ ఎలా ఉంటాయి.. తెలుసుకోండి..
Long Covid : ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Long Covid : ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. అత్యవసర పేషెంట్లకు ఆక్సిజన్ అందడం లేదు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కేసుల నుంచి రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే చాలామందిలో నెగిటివ్ వచ్చినా పోస్ట్ కొవిడ్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ కొవిడ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా మొదటి దశలో.. చలి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్, రుచి-వాసన లేకపోవడం, గొంతులో మంట వంటి లక్షణాలు ప్రధానంగా కనిపించేవి. కానీ సెకండ్ వేవ్ లో అదనంగా తలనొప్పి, కళ్ల రంగు మారడం లేదా రోజ్ కలర్లోకి మారడం, కళ్ల నుంచి నిరంతరాయంగా నీళ్లు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి కొందరికి నిరంతరం దగ్గు, జ్వరానికి బదులు గ్యాస్ సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. కోవిద్-19 వైరస్ కొద్ది పాటి లక్షణాలు ఉండే రోగులు ఒకటి నుంచి రెండు వారాల్లో కోలుకుంటారు. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నవారు మాత్రం కోలుకోవడానికి ఆరు లేదా ఏడు వారాలు పడుతుంది. అయితే కోవిద్-19 నుంచి కోలుకున్న తర్వాత, నెగిటివ్ వచ్చినా కూడా కొంచెం దగ్గు, బాడీ పెయిన్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, దాన్ని లాంగ్ కోవిద్ అంటారు. వీటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
1. చాలా మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆహారం రుచిని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా వీరికి ఆకలి లేకపోవడం జరుగుతుంది. 2. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. కొన్ని వారాల పాటు ఈ సమస్య ఉంటుంది. దీని నివారణకు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. 3. అలసట, తలనొప్పి.. కరోనా వైరస్ సంక్రమణ సమయంలో తలనొప్పి, అలసట ఉంటుంది. కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చినా కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే ఈ సమాచారం. మరేవైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.