Health Tips: రోజూ కాస్త బీరు తాగితే ఏంకాదు అనుకుంటున్నారా..? అయితే, ఈ వార్త మీ కోసమే..!
చాలా మంది ప్రజలు ఒత్తిడి నుంచి ఉపశమనం, శరీరం చల్లదనం కోసం బీరు తాగుతారు. బీర్ తాగడం వల్ల వారికి మంచి అనుభూతి కలుగుతుంది. అయితే, రోజూ బీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది, కాస్త బీర్ తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే, రోజూ కాస్త బీర్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ బీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాస్త బీర్ తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకునే వారికి ఈ వార్త ప్రత్యేకం.. ప్రస్తుతం ప్రజల జీవితాలు చాలా ఒత్తిడితో కూడుకున్నాయి. అలాంటి సందర్భంలో చాలా మంది ప్రజలు ఒత్తిడి నుంచి ఉపశమనం, శరీరం చల్లదనం కోసం బీరు తాగుతారు. బీర్ తాగడం వల్ల వారికి మంచి అనుభూతి కలుగుతుంది. అయితే, రోజూ బీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది, కాస్త బీర్ తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే, రోజూ కాస్త బీర్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ మొత్తంలో బీర్ తాగడం సమస్య కాదని మీరు అనుకోవచ్చు. అయితే అది నిజం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ పరిమాణంలో బీర్ తాగడం గుండెకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ప్రతిరోజూ తాగడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయంటున్నారు. బీర్‌లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం సమస్య పెరగడం ఖాయం. అంతే కాదు ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుంది.
ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. మీ రోగనిరోధక శక్తి తగ్గితే, అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు బీరు ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే అవకాశం ఉంది. ఇది మీ మూత్రపిండాలు, కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. బీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరిగే కొద్దీ చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతాయి.
అనేక పరిశోధనల ప్రకారం, ప్రతిరోజూ బీర్ తాగడం వల్ల నోరు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మళ్లీ ఈ సమస్య ప్రాణాంతకంగా మారి మీరు మీ జీవితాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..