రాత్రి నిద్రపోయే ముందు నోట్లో యాలకులు వేసుకుని పడుకుంటే.. ఏమవుతుందో తెలుసా..?

యాలకుల్ని 'క్వీన్ ఆఫ్ స్పైసెస్' అని కూడా పిలుస్తారు. యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్రని ప్రేరేపించడంలో ఇలాంచి సహాయపడుతుంది. అంతేకాదు.. రాత్రివేళ నిద్రపోయే ముందు రెండు యాలకులు నోట్లో వేసుకుని పడుకుంటే.. మీరు ఊహించని లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రి నిద్రపోయే ముందు నోట్లో యాలకులు వేసుకుని పడుకుంటే.. ఏమవుతుందో తెలుసా..?
Elaichi

Updated on: Feb 20, 2025 | 3:08 PM

యాలకులను ఇలాచి అని కూడా పిలుస్తారు. భారతీయ వంటలు, డెజర్ట్ లు తయారు చేయడంలో ఎక్కువగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మంచి సువాసన, రుచి కలిగి ఉండే యాలకులు.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అందుకే దీన్ని ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్’ అని కూడా పిలుస్తారు. యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్రని ప్రేరేపించడంలో ఇలాంచి సహాయపడుతుంది. అంతేకాదు.. రాత్రివేళ నిద్రపోయే ముందు రెండు యాలకులు నోట్లో వేసుకుని పడుకుంటే.. మీరు ఊహించని లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. దీనికోసం, పోషకమైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ ఉంటాయి. ఈ పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి. రాత్రిపూట నోటిలో యాలకులు పెట్టుకుని నిద్రపోవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దుర్వాసన వస్తుంది. దీని నుండి బయటపడాలంటే నోటిలో ఏలకులు పెట్టుకుని నిద్రపోవాలి. ఇది నోటి నుండి వచ్చే దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

యాలకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి పనిచేస్తాయి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నోటిలో ఉంచుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

యాలకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఏలకులను నోటిలో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు నోటిలో యాలకులు పెట్టుకుని నిద్రపోతే మంచి ఫలితం ఉంటుంది.. ఇలా చేయడం ద్వారా, మధుమేహం నియంత్రణలోకి రావడంతో పాటు..రోగనిరోధక శక్తి కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: ఇది భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్.. బ్రిటిష్ కాలంలో ప్రారంభం.. నేటికీ చెక్కుచెదరని అద్భుతం..!

ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్‌ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్‌ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్‌ పేలటంతో..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..

ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్‌ చేసేయండిలా..

ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి