Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Energy Saving: రాత్రి పూట మీ ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారా? ఎన్ని నష్టాలో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రస్తుత సమకాలీన సమాజంలో ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్కువ మొత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంది. అయినప్పటికీ దానిని వాడకుండా ఉండలేం. అలా అని రాత్రి సమయంలో ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేసి ఉంచడం వల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం రండి..

Energy Saving: రాత్రి పూట మీ ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారా? ఎన్ని నష్టాలో తెలిస్తే షాక్ అవుతారు..
Refrigerator
Follow us
Madhu

|

Updated on: Jun 07, 2024 | 3:38 PM

పవర్ సేవింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది కేవలం మన డబ్బును ఆదా చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే వీలైనంత తక్కువ పవర్ ను వినియోగించండి.. వృథాను తగ్గించండి అంటూ ప్రభుత్వాలు సూచిస్తూ వస్తున్నాయి. అంతేకాక విద్యుత్ శక్తి మనకు మనం తయారు చేసుకునేది కావడం వల్ల దానికి అవసరమయ్యే పదార్థాలు కూడా పరమితంగానే ప్రకృతిలో లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వ్యక్తులను తమ ఇంట్లో గది నుంచి బయటకు వెళ్లినప్పుడు లైట్ ఆఫ్ చేయడం, ఉపకరణాలు ఉపయోగంలో లేనప్పుడు వాటిని అన్‌ప్లగ్ చేయడం, ఎయిర్ కండీషనర్, రూమ్ హీటర్‌ల వినియోగాన్ని తగ్గించడం ఇవన్నీ విద్యుత్తును ఆదా చేసే సాధారణ మార్గాలు. వీటి ద్వారా మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. అయితే చాలా మంది విద్యుత్ ను ఆదా చేయడానికి రాత్రి సమయంలో రిఫ్రిజిరేటర్‌లను స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం సరైందేనా? చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? తెలుసుకుందాం రండి..

రిఫ్రిజిరేటర్ అవసరం..

ప్రస్తుత సమకాలీన సమాజంలో ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్కువ మొత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంది. అయినప్పటికీ దానిని వాడకుండా ఉండలేం. అలా అని రాత్రి సమయంలో ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేసి ఉంచడం వల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయి.

రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది..

రిఫ్రిజిరేటర్ ఆహార పదార్థాలు, పానీయాలను ఎల్లప్పుడూ తాజాగా ఉంచడం ప్రాథమిక విధి. మీ ఫ్రిజ్‌ని ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడ వల్ల లోపల ఉన్న తినే పదార్థాలు పాడవుతాయి. ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేశాక అది కేవలం 2-3 గంటలు మాత్రమే లోపలి భాగాన్ని చల్లగా ఉంచగలగుతుంది. మీరు రాత్రిపూట 5-6 గంటల పాటు రిఫ్రిజిరేటర్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని ఆలోచిస్తున్నట్లయితే, శీతలీకరణ లేకపోవడం వల్ల లోపల ఉన్న వస్తువులు పాడవుతాయి.

ఫంగస్ పెరుగుతుంది..

రిఫ్రిజిరేటర్ ఎక్కువ సేపు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం వల్ల లోపల అధిక ఉష్ణోగ్రత కారణంగా శిలీంధ్రాలు రిఫ్రిజిరేటర్లలో పెరుగుతాయి. ఫంగస్ ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఈ కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే, దాని లోపల ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. మీరు కొంత సమయం తర్వాత రిఫ్రిజిరేటర్‌ను పునఃప్రారంభిస్తే, కంప్రెసర్ రిఫ్రిజిరేటర్‌ను అదే ఉష్ణోగ్రతకు తిరిగి చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలా చేయడానికి మరింత ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. అంటే ఫ్రిడ్జ్ ని స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందలేరు.

ఆధునిక రిఫ్రిజిరేటర్‌లు థర్మోస్టాట్, ఆటో-కట్-ఆఫ్ ఫీచర్‌తో వస్తున్నాయి. దీని వల్ల అవసరమైన ఉష్ణోగ్రత రిఫ్రిజిరేటర్ చేరుకున్న తర్వాత కంప్రెసర్ స్వయంచాలకంగా ఆగిపోతోంది. దీనివల్ల ఫ్రిజ్ చల్లబడి విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి రాత్రి పూట ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేయడం ఎంతమాత్రం మంచిది కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..