- Telugu News Photo Gallery Do this for your eyes to function properly, check here is details in Telugu
Eyes Health: మీ కళ్లు సరిగ్గా పనిచేయాలంటే ఇలా చేయండి..
'సర్వేంద్రియాణాం నయనం' అన్నారు పెద్దలు.. అంటే కళ్లకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కళ్లు సరిగ్గా కనిపిస్తేనే ఏదైనా ఏమైనా చేయగలం. లేదంటే అంతా చీకటే. చుట్టూ ఏం జరుగుతుందో కూడా చెప్పడం కష్టం. కాసేపు కళ్లు మూసుకుని ఉంటేనే.. ఏదోలా ఉంటుంది. మరి దేవుడు ప్రసాదించిన ఆ కళ్లను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కళ్లకు ఏమైనా సమస్యలు వస్తే తప్ప.. అప్పటివరకూ కళ్లను అస్సలు పట్టించుకోరు. కానీ..
Updated on: Jun 07, 2024 | 4:04 PM

'సర్వేంద్రియాణాం నయనం' అన్నారు పెద్దలు.. అంటే కళ్లకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కళ్లు సరిగ్గా కనిపిస్తేనే ఏదైనా ఏమైనా చేయగలం. లేదంటే అంతా చీకటే. చుట్టూ ఏం జరుగుతుందో కూడా చెప్పడం కష్టం. కాసేపు కళ్లు మూసుకుని ఉంటేనే.. ఏదోలా ఉంటుంది.

మరి దేవుడు ప్రసాదించిన ఆ కళ్లను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కళ్లకు ఏమైనా సమస్యలు వస్తే తప్ప.. అప్పటివరకూ కళ్లను అస్సలు పట్టించుకోరు. కానీ ముందు నుంచే సరైన జాగ్రత్త తీసుకుంటేనే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ఎంతో అవసరం.

ఆరెంజ్, నారింజ పండ్లు తీసుకోవడం వల్ల కళ్లు చక్కగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకు కూరల్లో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోండి.

చేపల తినడం వల్ల కళ్లు, చర్మం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. క్యారెట్లు తినడం వల్ల కూడా కంటి చూపు బాగుంటుంది.

కళ్ల ఆరోగ్యాన్ని పెంచడంలో కోడి గుడ్లు కూడా చక్కగా పని చేస్తాయి. గుడ్లలో విటమిన్లు ఇ, సి, లుటిన్, జింక్ వంటివి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చిలకడ దుంప, బాదం పప్పు తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు చక్కగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగా పని చేస్తాయి.




