- Telugu News Photo Gallery Business photos Maruti suzuki offering huge discounts on cars upto RS 75000, Check here for full details
Car: కొత్త కారు కొనే వారికి పండగలాంటి వార్త.. వీటిపై రూ. 74 వేల వరకు డిస్కౌంట్
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి వినియోగదారులకు పండగలాంటి వార్త చెప్పింది. ఈ కంపెనీ పలు మాడళ్లకు చెందిన కార్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్, బోనస్‌లతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ పేరుతో ఏకంగా రూ. 74 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ మారుతి అందిస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 07, 2024 | 4:06 PM

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు టర్బో పెట్రోల్, వేరియంట్‌పై రూ. 74,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 15,000 నగది తగ్గింపుతో పాటు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2000 విలువైన కార్పొరేట్ బోనస్ అలాగే రూ. 43,000 డిస్కౌంట్‌తో పాటు పెట్రోల్ వేరియంట్‌పై అదనంగా రూ. 15 వేలు, రూ. 2 వేల కార్పొరేట్ తగ్గింపు లభిస్తోంది. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 7.52 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉంది.

మారుతి డిస్కౌంట్ అందిస్తోన్న మరో కారులో మారుతి సుజుకి ఎక్‌ఎల్6 ఒకటి. ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 30,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది. అలాగే సీఎన్‌సీ వెర్షన్‌పై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 11.61 లక్షల నుంచి రూ. 14.77 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి జిమ్మీ ధరలు గత నెలతో పోల్చితే తగ్గాయి. ఈ కారు అన్ని వేరియంట్స్‌పై రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తాయి. అయితే ఈ కారుపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ కానీ కార్పొరేట్ బోనస్‌లు లభించడం లేదు. మారుతి సుజుకి జిమ్మీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 14,95 లక్షల మధ్య ఉంది.

ఇక మారుతి సుజుకి సియాజ్ కారు విషయానికొస్తే దీనిపై రూ. 20,000 నగదు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3000 కార్పొరేట్ ప్రయోజనాలతో సహా మొత్తం రూ. 48,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

మారుతి సుజికి బాలెనోపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2000 కార్పొరేట్ బోసన్‌తో కలిపి మొత్తం రూ. 57,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే ఎమ్‌టీ వేరియంట్‌లో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు.





























