AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన బ్రహ్మాస్త్రం.. ఇలా చేస్తే దెబ్బకు హాంఫట్.. ట్రై చేయండి..

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. అన్ని రోగాలకు ప్రధాన కారణం అధికబరువు అని.. దానిని నియంత్రణకు డైట్ లో, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.. వాస్తవానికి ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నారు..

Weight Loss: గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన బ్రహ్మాస్త్రం.. ఇలా చేస్తే దెబ్బకు హాంఫట్.. ట్రై చేయండి..
Weiaght Loss
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2024 | 3:34 PM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. అన్ని రోగాలకు ప్రధాన కారణం అధికబరువు అని.. దానిని నియంత్రణకు డైట్ లో, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.. వాస్తవానికి ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నారు.. ఇది వారి శరీర ఆకృతిని పాడుచేయడమే కాకుండా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్, గుండెపోటు వంటి వ్యాధులకు దారితీస్తుంది. పొట్టను తగ్గించుకోవాలనుకునే కోరిక చాలా మందికి ఉన్నప్పటికీ.. జిమ్‌కు, నడకకు వెళ్లడానికి సమయం ఉండదు.. కావున అలాంటి వారు తప్పనిసరిగా తమ ఆహారాన్ని మార్చుకోవాలి.. అప్పుడే ఆశించిన ఫలితం లభిస్తుంది.

శరీర ఆకృతిని పొందడం, ప్లాట్ పొట్టను పొందడం ఎవరికైనా సులభం కాదు.. దీని కోసం మన రోజువారీ ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి.. ముఖ్యంగా పొట్టను తగ్గించుకోవాలనుకునే వారు రెగ్యులర్ వ్యాయామంతోపాటు.. కీర దోసను తీసుకోవాలి.. దీనిని తింటే మీరు సులభంగా బరువు తగ్గవచ్చంటున్నారు డైటీషీయన్లు..

కీర దోసకాయ తినడం వలన పొట్ట తగ్గడంతోపాటు కలిగే ప్రయోజనాలివే..

మనం సాధారణంగా సలాడ్ రూపంలో కీర దోసకాయను తింటాం.. ఇందులో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉన్నందున, ఇది బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సాధారణ కూరగాయ దోసకాయతోపాటు.. కీరదోసలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.. అధిక నీటి కంటెంట్ కారణంగా, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి ఉండదు. విటమిన్ సి, విటమిన్ కె ఈ దీనిలో ఉంటాయి.. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

దోసకాయ తింటే కడుపు త్వరగా నిండుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. తక్కువ తినడం మన బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.. దీంతో బొడ్డు కొవ్వును తగ్గించడం సులభం అవుతుంది.

లంచ్, డిన్నర్ సమయంలో దోసకాయ లేదా కీర దోసకాయ సలాడ్ చేసుకోని తినండి.. మీరు వాటి రుచిని పెంచుకోవాలనుకుంటే, దోసకాయతోపాటు క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టమోటా లాంటివి చేర్చుని వాటిపై కొంచెం నిమ్మరసం కలపండి. ఇది రెగ్యులర్ గా తింటే.. పొట్ట కొవ్వు వెన్నలాగా కరిగిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..