మీ పొట్ట గుట్ట అవుతుందా..? అయితే.. ఉదయాన్నే ఈ 5 తప్పులు చేస్తున్నట్లే.. బీకేర్‌ఫుల్
పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయి.. ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య చాలామందిని వెంటాడుతోంది.. ఊబకాయం అనేది తీవ్రమైన జీవనశైలి సంబంధిత సమస్య.. ఇది ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి భోజనం, నిద్ర వరకు ముడిపడిఉంటుంది..

పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయి.. ప్రస్తుత కాలంలో ఊబకాయం సమస్య చాలామందిని వెంటాడుతోంది.. ఇది ప్రమాదకర గుండె, ఇతర అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.. ఊబకాయం అనేది తీవ్రమైన జీవనశైలి సంబంధిత సమస్య.. ఇది ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి భోజనం, నిద్ర వరకు ముడిపడిఉంటుంది.. ఇందులో ప్రధానంగా ఉదయం నిద్రలేచినప్పటి నుంచి టిఫిన్ నుంచి.. మధ్యాహ్నం భోజనం వరకు మనం అవలంభించే దినచర్య కూడా ప్రభావితం చూపుతుంది. అందుకే.. మీరు రోజును ఎలా ప్రారంభించాలో మీ ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది. దీని మొదటి ప్రభావం శరీర బరువుపై కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ బరువు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు చూస్తున్నట్లయితే, మీరు మీ రోజును తప్పుడు మార్గంలో ప్రారంభిస్తున్నారని సంకేతంగా అర్థం చేసుకోవాలి.. ఉదయాన్నే చేసే తప్పుల వల్ల కూడా బరువు అమాంతం పెరుగుతారు.. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకోండి…
స్థూలకాయానికి కారణమయ్యే 5 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకోండి..
ఆలస్యంగా మేల్కొనడం:
తెల్లవారుజాము వరకు నిద్రపోవడం వల్ల శరీరం సహజ సిర్కాడియన్ రిథమ్, జీవక్రియ, ఆకలి దెబ్బతింటుంది. క్రమరహిత నిద్ర విధానాలు తరచుగా ఆకలిని పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది.
నీరు తాగకపోవడం:
రోజును ముందు నీటితో ప్రారంభించాలి. ఇలా లేకుంటే.. నిర్జలీకరణం ఆకలిని పెంచుతుంది. అందువల్ల ఊబకాయానికి దారితీసే క్యాలరీలను తీసుకునే అవకాశం పెరుగుతుంది.
తీపి పానీయాలతో రోజును ప్రారంభించడం:
టీ, కాఫీ వంటి తీపి పానీయాలు అదనపు కేలరీలను జోడిస్తాయి. ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. ఈ పానీయాలు తరచుగా రక్తంలో చక్కెరలో వేగవంతమైన పెరుగుదలకు కారణమవుతాయి. ఇది కోరికలకు పెంచి.. అతిగా తినడానికి దారితీస్తుంది.
అల్పాహారం మానేయడం:
చాలా మంది అల్పాహారం తినరు.. కానీ ఇది రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం. అల్పాహారం తీసుకోని వ్యక్తులు సాధారణంగా అతిగా తినడం, తప్పుడు ఆహారపు అలవాట్లకు గురవుతారు. ఊబకాయం పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.
అల్పాహారంలో తక్కువ ప్రోటీన్ తీసుకోవడం:
ప్రోటీన్ ఆకలిని నియంత్రిస్తుంది.. కండరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒక వయోజన వ్యక్తి అల్పాహారంలో 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. కానీ మీరు ఇలా చేయకపోతే ప్రమాదమే.. ప్రోటీన్‌లకు బదులుగా గుండె పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తింటుంటే, మీ శరీరంలో కొవ్వు పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




