Pregnancy: గర్భిణుల్లో ఈ లోపం ఉంటే.. పుట్టబోయే పిల్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న డయాబెటిస్ కూడా గర్భిణుల ఆరోగ్యమే కారణమని నిపుణులు అంటున్నారు. గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉంటే.. అది పుట్టబోయే బిడ్డల్లో టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకలపై జరిపిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ...

పుట్టబొయే బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే గర్భిణులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. తీసుకునే ఆహారం మొదలు జీవన విధానం వరకు అన్ని విషయాల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే వ్యాధులకు తల్లి నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న డయాబెటిస్ కూడా గర్భిణుల ఆరోగ్యమే కారణమని నిపుణులు అంటున్నారు. గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉంటే.. అది పుట్టబోయే బిడ్డల్లో టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకలపై జరిపిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చెప్పట్టారు. గర్భసంచిలో ఏర్పడే కొన్ని పరిస్థితులు పిల్లల్లో జీవితాంతం ఎదుర్కోవాల్సిన పరిస్థితులకు దారి తీస్తుందని నినపుణులు అంటున్నారు.
గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కార్లోస్ బెర్నల్-మిజ్రాచీ ఈ విషయమై మాట్లాడుతూ.. గర్భిణీల్లో విటమిన్ డీ లోపం ఉంటే అది పుట్టబోయే పిల్లల్లో డయాబెటిస్‌కు దారి తీసే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలోనే గర్భధారణ సమయంలో గర్భాశయంలో తలెత్తే పరిస్థితులను విశ్లేషించటం మీద దృష్టి సారించామని కార్లోస్ తెలిపారు.
విటమిన్ డి లోపం కారణంగా ఎలుకలకు పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతోందని, దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్‌కు దారి తీస్తోందని పరిశోధనల్లో తేలింది. పుట్టిన తర్వాత కూడా తగినంత విటమిన్ డి ఇస్తే గ్లూకోజు మోతాదులు కొంతవరకు సర్దుకున్నప్పటికీ పూర్తిగా మామూలు స్థాయులకు రాకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. పిండం ఎదుగుతున్న సమయంలో విటమిన్ డీ లోపం ఉంటే.. రోగనిరోధక కణాలు దెబ్బతింటున్నాయని, ఇవి మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి గర్భిణీలు తప్పకుండా కాసేపు ఎండలో ఉండడం, అలాగే విటమిన్ డీ సప్లిమెంటరీ ఫుడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




