Salt: వామ్మో.. ఉప్పు తింటే క్యాన్సర్ వస్తుందా.? పరిశోధనల్లో భయంకర విషయాలు
అయితే వీటన్నింటికీ మించి మరో పెద్ద సమస్య కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో...

ఉప్పు లేనిది రోజు గడవని పరిస్థితి. కచ్చితంగా ప్రతీ కూరలో ఉప్పు వేసుకోవాల్సిందే. ఉప్పు లేని కూరను ఊహించుకోవడం కూడా అసాధ్యం. అయితే ఇంతలా ఉపయోగపడే ఉప్పు ఎన్నో సమస్యలకు సైతం కారణమవుతుందని తెలిసిందే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అలాగే దాహం పెరుగుతుంది. శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది, కిడ్నీ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
అయితే వీటన్నింటికీ మించి మరో పెద్ద సమస్య కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో కనిపిస్తున్న క్యాన్సర్స్‌లో జీర్ణాశయ క్యాన్సర్ ఐదో స్థానంలో ఉంది. దీంతో అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందన్న దానిపై నిపుణులు పరిశోధనలు చేపడుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తరచూ కూరలో ఉప్పు అదనంగా వేసుకొని తినే వారిలో పొట్ట క్యాన్సర్ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయం లోపల జిగురుపొర దెబ్బ తింటుందని పరిశోధనల్లో తేలింది. ఇది కడుపులో హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కడుపులో ఇన్ఫెక్షన్ తలెత్తడానికి కారణం అవుతుందని పరిశోధనల్లో తేలింది. అదే విధంగా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బ తినడానికి కూడా ఇది కారణమవుతుందని. కాల క్రమేణ ఇది క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే ఉప్పు తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరల్లో పై నుంచి ఉప్పు వేసుకోవడం పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




