AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: మాంసం ఇష్టం లేదా? అయితే కాల్షియం అందించే ఈ శాకాహారాలు తినేయండి

నేటి జీవన శైలి కారణంగా ఎప్పుడో 60 యేళ్లకు రావల్సిన మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల సమస్యలు.. యువతలో కూడా కనిపిస్తున్నాయి. మరీ ఇంత చిన్న వయస్సులో ఎముకల వ్యాధులు రావడం అంత మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, అధిక శారీరక శ్రమ, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం..

Bone Health: మాంసం ఇష్టం లేదా? అయితే కాల్షియం అందించే ఈ శాకాహారాలు తినేయండి
పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే, ఎముకల ఆరోగ్యానికి వీటిని తీసుకోవడం చాలా అవసరం. వీలైతే రోజూ పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. అందుకే పిల్లలు రోజూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Srilakshmi C
|

Updated on: Sep 26, 2024 | 8:56 PM

Share

నేటి జీవన శైలి కారణంగా ఎప్పుడో 60 యేళ్లకు రావల్సిన మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల సమస్యలు.. యువతలో కూడా కనిపిస్తున్నాయి. మరీ ఇంత చిన్న వయస్సులో ఎముకల వ్యాధులు రావడం అంత మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, అధిక శారీరక శ్రమ, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వంటి అనేక సమస్యలు ఎముకల సమస్యలకు కారణమవుతాయి. ఎముకలు, కండరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి బరువు తగ్గడం ఒక్కటే మార్గం కాదు. ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. చేపలు, మాంసం తింటే కండరాలు, ఎముకలు బలపడతాయని చాలా మంది అనుకుంటారు. మాంసాహారంలో మాత్రమే పోషకాలు పుష్కలంగా ఉంటాయను కోవడం పొరబాటు. శాఖాహారం తీసుకోవడం ద్వారా కూడా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

తాజా కూరగాయలు

పాలకూర, గుమ్మడికాయ, పొట్లకాయ, మెంతికూర వంటి ఔ వివిధ రకాల కూరగాయలు ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కూరగాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. ఈ కూరగాయలు ప్రేగులు, చర్మానికి కూడా మేలు చేస్తాయి.

పెరుగు

చాలామందికి పాలు అంటే ఇష్టం ఉండదు. ఇలాంటి వారు పెరుగు తినవచ్చు. పెరుగులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి12 వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు పుష్కంగా ఉంటాయి. పుల్లని పెరుగు ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఇవి కూడా చదవండి

బాదం పప్పు

ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గుప్పెడు బాదంపప్పు తినడం వల్ల ఎముకల సమస్యలను నివారించవచ్చు. ఈ గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో కాల్షియంతో పాటు ప్రొటీన్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను నివారించడంలో సహాయపడతాయి.

సిట్రస్ పండ్లు

నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్ వంటి సిట్రస్ పండ్లు ఎముకలకు మేలు చేస్తాయి. ఇటువంటి పండ్లలో కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. పుల్లటి పండ్లు తినడం వల్ల ఎముకల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్

బాదంపప్పులతో పాటు వాల్‌నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..