AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

మనకు మనం, ముఖ్యంగా మనం ప్రేమించే వారికి బహుమతులు ఇవ్వడం ఆనందాన్ని కలిగించే విషయం. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే చిన్న చిన్న బహుమతులు బంధాలను మరింత మధురంగా మారుస్తాయి. అయితే కొన్ని రకాల వస్తువులు గిఫ్ట్ గా ఇస్తే మీ బంధం మసకబారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి
Gift Giving Mistakes
Srilakshmi C
|

Updated on: Jul 01, 2026 | 8:46 PM

Share

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమికులకు కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం అపశకునంగా పరిగణించబడుతుంది.

మునిగిపోతున్న ఓడ ఫోటో

మునిగిపోతున్న ఓడకు సంబంధించిన ఫోటోలు లేదా చిత్రాలను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతకు సంకేతంగా భావిస్తారు. అంతేకాకుండా సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశముందని నమ్మకం.

నల్లని దుస్తులు

నలుపు రంగు దుస్తులు ఫ్యాషన్‌లో భాగమైనప్పటికీ, కొన్ని విశ్వాసాల ప్రకారం వాటిని బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. నలుపు రంగు ప్రతికూలత, విచారం, విరహానికి ప్రతీకగా భావిస్తారు. దీంతో అపార్థాలు, అనవసర గొడవలు తలెత్తే అవకాశం ఉందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

బూట్లు, చెప్పులు

చాలామంది ఉపయోగకరమైన బహుమతులుగా బూట్లు, చెప్పులు ఇస్తుంటారు. అయితే సంప్రదాయ విశ్వాసాల ప్రకారం వీటిని బహుమతిగా ఇవ్వడం విడిపోవడానికి సంకేతంగా పరిగణిస్తారు. దంపతుల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని చెబుతారు.

చేతిరుమాళ్లు

చేతిరుమాళ్లను బహుమతిగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించరు. ముఖ్యంగా భార్యాభర్తలు లేదా ప్రేమికులు ఒకరికొకరు చేతిరుమాళ్లు బహుమతిగా ఇచ్చుకోవడం వల్ల విచారం, అపార్థాలు, గొడవలు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమ్మకాలు సూచిస్తున్నాయి.

పెర్ఫ్యూమ్

పెర్ఫ్యూమ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన బహుమతుల్లో ఒకటి. అయినప్పటికీ కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం పెర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. పెర్ఫ్యూమ్ సువాసన క్రమంగా తగ్గిపోవడం మాదిరిగానే బంధంలోని ప్రేమ కూడా తగ్గిపోతుందనే నమ్మకం ఉంది.

గాజు వస్తువులు

గాజుతో తయారైన అలంకరణ వస్తువులు, షోపీసులు అందంగా కనిపించినప్పటికీ వాటిని బహుమతిగా ఇవ్వడం నివారించాలని కొందరు సూచిస్తారు. గాజు సులభంగా పగిలిపోయే స్వభావం కలిగి ఉండటంతో, అది బంధాల బలహీనతకు ప్రతీకగా భావిస్తారు. దీంతో సంబంధాల్లో ఉద్రిక్తతలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని నమ్ముతారు. పైన పేర్కొన్న అంశాలు శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలు కాకుండా, వాస్తు, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు మాత్రమే. బహుమతుల కంటే వాటి వెనుక ఉన్న ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవమే ఏ సంబంధానికైనా బలమైన పునాది అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us