పైసా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.. నేరేడు గింజల పొడితో ఆ రోగాలన్నీ పరార్
Samatha
1 July 2026
వేసవి, వర్షాకాలం ప్రారంభంలో నేరేడు పండ్లు ఎక్కువగా లభిస్తాయి. దీంతో చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.
నేరేడు పండ్లు
అయితే నేరేడు కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఇవి లభించే సీజన్‌లో తప్పకుండా వీటిని తినాలి అని చెబుతుంటారు.
ఆరోగ్యానికి మేలు
అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదండో, వాటి గింజలు తిన్నా బోలెడు లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.
వాడి గింజల పొడి
ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉన్నదంట. అందువలన వీటిని అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తారు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆయుర్వేదం
మధుమేహం సమస్యతో బాధపడే వారు నేరేడు గింజలను పౌడర్‌గా చేసుకొని, నీటిలో వేసుకొని రోజుకు గ్లాస్ తాగడం వలన ఇది రక్తంలోని ఇన్సులిన్ తయారీని మెరుగు పరుస్తుందంట.
మధుమేహం
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదంట. ఈ పౌడర్ తీసుకోవడం వలన ఇది కడుపు, అజీర్ణం వంటి సమస్యలతో మిమ్మల్ని కాపాడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
జీర్ణక్రియ
నేరేడు గింజల పొడిని రోజూ తీసుకోవడం వలన ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందంట.
అధక రక్తపోటు
అంతే కాకుండా ఈ పొడి మూత్ర పిండాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు నిపుణులు.